అదేంటంటే ఎలక్షన్స్ పిచ్చి. ఇలా పాలిటిక్స్ పిచ్చి చాలామందికి ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలని.. మంచి పదవులు సంపాదించాలని ఎంతోమంది ఆశ పడుతూ ఉంటారు. ఈయనకు కూడా ఇలాంటి ఒక ఆశ ఉంది. అందులో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా.. సాధారణంగా ఎన్నికల్లోకి వచ్చి మంచి పదవులు చేపట్టాలని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఎన్నోసార్లు ఓడిపోయాడు. అయినప్పటికీ ఇప్పటికీ పోటీ చేస్తూనే ఉన్నాడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండాఎన్నికల్లో పోటీ చేయడమే ఆయన పిచ్చి. అందుకే ప్రస్తుతం ఆయన వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.
ఆగ్రాకు చెందిన హన్శురాం అంబేద్కరీ అనే 78 ఏళ్ల వ్యక్తికి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటివరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన అయితే ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత ఎవరైనా పాలిటిక్స్ పై ఆశలు వదులుకుంటారు. కానీ ఈయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు. రానున్న ఎన్నికలకు ఆగ్ర, ఫతేపూర్ సిక్రీ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అన్నింట పోటీ చేశా రాష్ట్రపతి పదవికి కూడా ట్రై చేశా . కానీ తిరస్కరించారు. ఇక 100 సార్లు పోటీ చేయడమే నా లక్ష్యం. అది పూర్తయ్యాక పోటీని విరమించుకుంటా అంటూ హన్శురాం అంబేద్కరీ చెబుతున్నారు.