ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బస్సుయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న రాత్రి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది.. ఈ ఘటనపై అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ , ఇటు అభిమానులు,  సామాన్య ప్రజలు కూడా నివ్వరపోవడమే కాదు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు కూడా చేస్తున్నారు.. ముఖ్యంగా జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థి వర్గాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..


 అంతేకాదు ఈ ఘటన జరిగిన కొన్ని క్షణాలలోనే ఈ విషయంపై జాతీయ రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.. అలాగే తమిళనాడు సీఎం ఏం కే స్టాలిన్,  తెలంగాణ మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కేసిఆర్ కూడా ట్విట్టర్లో స్పందించారు.. ఇక అప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది.. కానీ జగన్ పై సానుభూతితో కాదు... ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సరికావని.. ఇది కోడి కత్తి డ్రామా అంటూ తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇలాంటి ఘటన జరిగిన సమయంలో సానుభూతి చూపించకుండా.. రాజకీయం చూపించారు ప్రతిపక్ష పార్టీ నేతలు..  ముఖ్యంగా సానుభూతి కోసమే జగన్ తనపై దాడి చేయించుకున్నాడు అంటూ తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ రావడంతో ప్రజలు సైతం ఇలాంటి సమయంలో ఇలాంటి ట్వీట్స్ చేయడం సరికాదు అంటూ ప్రత్యర్థి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరొకవైపు చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు, అధికారిక, అనధికారిక మీడియాకు విరుద్ధంగా స్పందించారు.. సిబిఐ విచారణలో అది ఇది అంటూ మాట్లాడినా.. తెలుగుదేశం ఆస్థాన మీడియా లాగా మాత్రం చంద్రబాబు స్పందించలేదు.. ఎందుకంటే ప్రధానితో సహా ఇతర రాష్ట్రాల నేతల స్పందనతో చంద్రబాబు భయపడినట్లున్నారు.. పైగా  ఇక్కడ మోడీ స్పందన అలాగే పక్క రాష్ట్రాల వారు స్పందించడంతో వెనక్కు తగ్గిన చంద్రబాబు.. అందరూ స్పందించిన తర్వాత మళ్లీ స్పందించకపోతే బాగుండదేమో అని ఆలోచించినట్లున్నారు.. అందుకే జగన్ కోలుకోవాలని ట్వీట్ చేశారు.. అయితే ఆయన ట్వీట్ లో కూడా నిజాయితీ ఏమాత్రం కనిపించలేదు. ఇక జగన్ పై జరిగిన హత్యాయత్నానికి, ప్రజానీకానికి భయపడి స్పందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: