ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల కోసం బాబు జనసేన, బీజేపీ లతో కలిసి ముందడుగు వేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొదట తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయి అని అంతా భావించారు. కానీ చివరకు సీన్ లోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దానితో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఈసారి కూటమికి చాలా బలం చేకూరినట్లే అవుతుంది అని అంతా భావించారు.

ఆ తర్వాతే సీన్ రివర్స్ అయ్యింది. సీట్ల పంపకం విషయంలో అనేక పొరపాట్లు, ఏ ఏరియాలో అయితే చాలా క్రేజ్ ఉన్న నాయకులు ఉంటారో అలాంటి కొన్ని ఏరియాలో వేరే వాళ్లకు సీట్ వెళ్లడం. దీనితో అక్కడ రెబల్స్ బెడద పార్టీలకు పట్టుకుంది. దానితో ఇది వైసీపీకి చాలా కలిసి వచ్చే అంశంగా మారింది. ఇక కేవలం ఒకే ఒక్క జిల్లాలో టీడీపీ పార్టీ నుండి ముగ్గురు రెబల్ అభ్యర్థులు తయారయ్యారు.

ఆ ఏరియాలో పరిస్థితి అంతుచిక్కకుండా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి ముగ్గురు రెబల్ అభ్యర్థులు తయారయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గం సీటును గడ్డి ఈశ్వరి తనకే దక్కుతుంది అని ఇంతకాలం భావించింది. కానీ ఆమెకు బాబు హ్యాండ్ ఇవ్వడంతో ఈమె ప్రస్తుతం తన కేడర్ తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెబల్ గా భారీ లోకి దిగిన ఆశ్చర్యం అవసరం లేదు అని వార్తలు వస్తున్నాయి.

ఇక రంపచోడవరం నుండి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసిన రాజేశ్వరి పరిస్థితి కూడా ఇదే. బాబు కనీసం గెలిచి పార్టీ మారి తన వద్దకు వచ్చిన కృతజ్ఞత కూడా లేకుండా ఈమెకు కూడా సీట్ ఇవ్వలేదు. దానితో ఈమె కూడా రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అరకు విషయానికి వస్తే దున్ను దొరను ముందుగా అభ్యర్థిగా ప్రకటించి ఆ తర్వాత ఇక్కడి సీటు బీజేపీ అంటూ దున్ను దొరకు హ్యాండ్ ఇచ్చారు. దానితో ఈయన కూడా రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ముగ్గురు రెబల్ అభ్యర్థులు టీడీపీ నుండి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: