ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఎందుకంటే దేశ వ్యాప్తం గా అన్ని రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమం లోనే అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తూ బిజీ బిజీగా మారి పోయాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకు పడుతూ ఉన్నాయి. అదే సమయం లో తమను గెలిపించాలని ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.



 కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే.. ఇంకొన్ని పార్టీలు ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని పావులు కదుపుతూ ఉన్నాయి. ఇలా ఎవరికి వారు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇక గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నారు అని విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఎన్నికల హడావిడిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని జైల్లో ఉన్న ఖైదీలు కూడా అనుకుంటున్నారట.



 ఈ క్రమం లోనే ఎన్నికల నేపథ్యం లో  ఒడిశా లో కోర్టులో భారీగా బెయిల్ పిటిషన్లు దాఖలు అవుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఓటు వేసేందుకు తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు కోరుతున్నారట. అయితే ఎన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇక ఎవరికైనా బెయిల్ వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ఇలా పెద్ద మొత్తం లో ఒకేసారి బెయిల్ పిటీషన్స్ రావడం మాత్రం ఇదే తొలిసారి అంటూ చెబుతున్నారు నిపుణులు. కాగా మే 13 నుంచి జూన్ 1 మధ్య అటు ఒడిశాలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: