ఉమ్మడి అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థిగా పరిటాల సునీత ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. రాయలసీమలో పరిటాల కుటుంబానికి మంచి క్రేజ్ ఉంది. అయితే రవి హత్యానంతరం జరిగిన ఎన్నికలలో పరిటాల రవి భార్య సునీతకు ఓట్లేసి అక్కడ ప్రజలు గెలిపించారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఏకంగా మంత్రి కూడా అయ్యారు. దీంతో ప్రజలలో కూడా ఈమె మంచి పేరు సంపాదించుకుంది.


సునీతమ్మ సోదరులైన బాలాజీ , మురళిలను నియోజకవర్గాలలోని మండలాల ఇన్చార్జిలుగా కూడా నియమించారు. ఈ విషయాన్ని ఇద్దరు సోదరులు అదునుగా చూసుకొని బాగా డబ్బు సంపాదనకు అలవాటు పడిపోయారట. దీంతో అక్కడ వీరికి తెలియందే ఏ పనులు కూడా జరగనంత స్థాయికి వెళ్లిపోయాయి.. ముఖ్యంగా విద్యార్థులు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాల ఇవ్వాలన్నా కూడా వీరు కరుణిస్తేనే ఆ పత్రాలు జారీ చేసేవారని.. అప్పట్లో ఈ విషయం పెద్ద ఎత్తున ఆరోపణలకు గురైంది.  


తమ్ముళ్ల దురాగతాలను చూసి చూడనట్లుగా ఉండడం వల్లే సునీత కు చాలా కష్టాలు ఎదురయ్యాయని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సునీతమ్మ ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా ఇదేనని.. దీని వల్లే మరొకసారి మార్పు కలిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సునీతమ్మ ప్రాంతంలోనే చాలామంది ఆమెకు వ్యతిరేకంగా లోలోపల ప్రచారం చేశారట ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు 2019లో పసిగట్టి ఆమెకు కాదని ఆమె కుమారుడు శ్రీరామ్ కి టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆమె సోదరులు చేసిన తప్పుకు శ్రీరామ్ ఓడిపోయారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక సునితమ్మ రాప్తాడు నుంచి పెనుగొండ కు వెళ్లి పోటీ చేయాలని నిర్ణయించుకుంది అయితే చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో రాప్తాడు టికెట్టు మళ్లీ శ్రీరామ్ కి బదులుగా సునితమ్మకు ఇచ్చారట.


ఈ నేపథ్యంలోనే సునీతమ్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో సునీతమ్మ తమ్ముళ్ళను దూరం పెట్టి మళ్ళీ ప్రచారంలోకి దిగాలని చూస్తోంది. అయితే ఆమె సోదరులు మాత్రం కొంతమంది నాయకులను కలిసి సహకరించాలని కోరుతున్నప్పటికీ నేరుగా ఎలాంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. మరి ఇలాంటి మార్పు వల్ల సునీతమ్మ గెలుస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: