తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  మొదటిసారిగా కేసీఆర్ సీఎం కూర్చిని  అలంకరించారు. మొదటగా 2014లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మెజారిటీతో  అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్  ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. ఈ టైంలో ముఖ్యమంత్రిగా వచ్చిన కేసీఆర్  అన్ని తానై  పాలన అందించారు.  ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం లాగా  రాజకీయం నడిచింది. కేసీఆర్ మాట కాదని ఏ నాయకుడు నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు వచ్చేది కాదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పూర్తిస్థాయిలో నేనే రాజు నేనే మంత్రిలా వ్యవహరించారని చెప్పవచ్చు. 

ఆయన కింద ఉన్న  నాయకులంతా  సొంతంగా ఏ డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. 2023 ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇదే తరుణంలో పార్లమెంటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా  పోటీ చేయడానికి కనీసం నాయకులు దొరకడం లేదట. ఒకప్పుడు ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ కు  ఈ విధంగా నాయకులు దొరకకపోవడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

 అక్కడ ఇక్కడ వెతికి  కొంతమంది నాయకులను బరిలో దించినా, కనీసం ప్రచారం కోసం కేటీఆర్, హరీష్ రావు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కనీసం ఎంపీ అభ్యర్థులుగా ఉన్న వారికి ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా  సపోర్ట్ చేస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదట. అయితే ఈ పరిస్థితిని బట్టి చూస్తే  కేసీఆర్ ఇన్నాళ్లు  ఆ నాయకులందరినీ ప్రేమతో చూసుకోకుండా వారి మైనస్ ల మీద దెబ్బ కొట్టి వారి పార్టీలో చేర్పించుకున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయిన తర్వాత కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా కేసీఆర్ కి సపోర్ట్ చేయడం లేదంటే ఆయన టార్చర్ ఏ విధంగా పెట్టారనేది  అర్థమవుతుంది.

  ఒకవేళ కేసీఆర్ ఆ నాయకులను స్వేచ్ఛగా వదిలిపెట్టి ఉండేది ఉంటే ఓటమి అయిన, గెలుపైన ఇప్పుడు ఆయన వెంట ఉండేవారు. కానీ కేసీఆర్   వాళ్ళని భయాందోళనలకు గురిచేసి  బయటకు వెళ్తే మీ బ్రతుకులు ఆగం చేస్తాను అనే విధంగా భయపెట్టి మరీ ఆ పార్టీలో ఉంచుకున్నారు. ఈ స్ట్రాటజీ  కేసీఆర్  అధికారంలో ఉన్నన్ని నాల్లే వారు పాటించారు. ఎప్పుడైతే ఆయన అధికారం  కోల్పోయారో అప్పుడే ఆయన కూతురు అరెస్ట్ అయింది నాయకులంతా చేజారిపోయారు.  కనీసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, కాంగ్రెస్ గేట్లు తెరిస్తే అంతా  అందులో జాయిన్ అయ్యేవిధంగా కసరత్తులు చేస్తున్నారని కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: