ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్  లో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు వేడెక్కాయి. ఇక అన్ని పార్టీలకు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. కానీ జహీరాబాద్ లో నిలబెట్టిన అభ్యర్థి విషయంలో కేసిఆర్ తప్పు చేశారా అనే వాదన అక్కడక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అటు మున్నూరు కాపు తో పాటు లింగాయత్ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.


 ఒక రకంగా చెప్పాలంటే అక్కడ లింగాయత్లదే డామినేషన్ కొనసాగుతుంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా.. ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి. అయితే ఈ మూడు సార్లు లింగాయత్ వర్గానికి చెందిన నేతలే  ఎంపీలుగా ఎన్నిక కావడం గమనార్హం. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ టిఆర్ఎస్ ను వదిలి బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి సురేష్ షట్కర్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతలే.


 అంతేకాదు ఇక జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో మంచి పట్టున్న నేతలుగా కూడా ఉన్నారు  అయితే ఇద్దరు లింగాయత్ నేతలను కాదని గాలి అనిల్ కుమార్ఎంతవరకు ఓట్లు తన వైపు తిప్పుకోగలడు అన్నది హాట్ టాపిక్ మారింది. అయితే ఇప్పటివరకు ఈ పార్లమెంట్ స్థానంలో ఒకసారి కూడా ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు గెలవకపోవడం.. మూడుసార్లు లింగాయత్ నేతలే విజయం సాధించడం.. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి సురేష్ శత్కర్.. ఇక బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ బేబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ లింగాయత్ నేతలు కావడంతో ఇక ఎలాగో ఓడిపోతామని తెలిసే.. కేసీఆర్ గాలి అనిల్ కుమార్ కు జహీరాబాద్ నుంచి టికెట్ ఇచ్చారు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మరి చివరికి ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: