అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏకంగా ఆ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న నేతలు చివరికి పార్టీకి గుడ్ బై చెప్పేసి మరో పార్టీలో చేరుతున్నారు. ఇలా ఇంకో పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో బలులోకి దిగడం కూడా చూస్తున్నాం. అయితే  జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితె నెలకొంది. అక్కడ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా అయితే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోటగా పిలుచుకుంటూ ఉంటారు.


 ఎందుకంటే ఇక్కడ రెండుసార్లు బిఆర్ఎస్ విజయ డంకా మోగించింది. కానీ ఇప్పుడు అదే బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరి పోటీ చేస్తున్నారు. సాధారణంగా  ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీలు లింగాయత్ లే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు వరకు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మూడుసార్లు ఎన్నికలు జరిగితే మూడుసార్లు లింగాయత్ వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి.


 ప్రస్తుతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బిజెపి తరఫున బీబీ పాటిల్ బరిలో నిలవగా.. కాంగ్రెస్ తరపున సురేష్ షెత్కర్ కి టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీని వీడటంతో ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన గాలి అనిల్ కుమార్ ను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది బీఆర్ఎస్. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూసుకుంటే కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ స్థానాలలో కలిపి  5 లక్షల 47 వేల పది ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల 547 ఓట్లు వచ్చాయి. బిజెపికి లక్ష 71, 100 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇలా గత అసెంబ్లీఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లతో పోల్చి చూస్తే  కనీసం సగం కూడా సాధించలేకపోయింది బిజెపి. మరిప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పోటీ చేస్తుండగా.. బిజెపి ఎంత మేరకు సత్తా చాటగలదు. ఓట్లని రాబట్టగలదు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp