ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అన్ని పార్టీలు గెరిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. టిడిపి, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఇక సీట్ల సర్దుబాటులో భాగంగా 21 అసెంబ్లీఫ్రెండ్,2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది పవన్ కళ్యాణ్ పార్టీ.


 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయనకు వస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే.. అక్కడి నుంచి గెలవడమే ఖాయం అని చాలామంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అటు జనసేన పార్టీకి ఒక ట్రబుల్ షూటర్ అవసరం ఏర్పడింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే పార్టీలో ఆ మూల నుంచి ఈ మూల వరకు వచ్చిన సమస్యలన్నింటిని కూడా అధినేత ఒక్కరే పరిష్కరించుకోలేరు. అన్నింటిని ఆయనే చూసుకోలేడు. అందుకే అధినేత దగ్గరికి వివాదం వెళ్లకుండా పరిష్కరించే ఒక ట్రబుల్ షూటర్ ఏ పార్టీకైనా అవసరం.


 కానీ జనసేన పార్టీకి ఇప్పుడు ఆ ట్రబుల్ షూటర్ లేకపోవడమే ఇబ్బందిగా మారింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే 21 అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది జనసేన. అన్ని పార్టీలలో లాగానే కొన్ని కొన్ని స్థానాలలో జనసేనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి  కొంతమంది నేతల నుంచి అసంతృప్తి  వ్యక్తం అవుతుంది. అయితే ఇలాంటి సమస్యలను ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల తిరుపతిలో ఇబ్బందికరంగా మారిన పంచాయతీని సైతం సెట్ చేసేసారు పవన్.


 అయితే ఒకప్పుడు ఇలా పార్టీలోని వివాదాల విషయాన్ని నాదెండ్ల మనోహర్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎన్నికల బరిలో ఉండడంతో తన ప్రచార వ్యవహారాలతోనే బిజీగా ఉన్నారు. ఇంకోవైపు మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ఇలా వివాదాలు పరిష్కరించడంలో మాత్రం ఆసక్తిని చూపించడం లేదు. దీంతో ఇక చిన్నాచితక వివాదాలనుంచి పెద్ద వివాదాలు వరకు అన్ని పవన్ కళ్యాణ్  స్వయంగా పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు నేపద్యంలో జనసేనకు ఒక ట్రబుల్ షూటర్ అవసరం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: