ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల పోరు రోజురోజుకీ ఉత్కంఠతను పెంచుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలలో కీలకమైన పరిణామాలు రోజురోజుకీ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కూటమిలో భాగంగా మూడు పార్టీలలోని కొంతమంది సీనియర్ నేతలు సీట్లు దక్కకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది పార్టీలు కూడా వీడారు. ఇప్పుడు తాజాగా టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ పెందుర్తి సీటు తనకు వస్తుందని ఆశించారు. ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించడంతో ఇటీవలే విశాఖకు వచ్చిన చంద్రబాబును ఆయన కలవడం జరిగింది. ఆ సమయంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి


టిడిపి సీనియర్ నేత అయిన బండారు సత్యనారాయణకు సీటు రాలేదని.. ఈ సీటును జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు కూటమిలో భాగంగా కేటాయించారు. దీంతో బండారుకు సీటు రాకపోవడం పైన మనస్థాపానికి గురై గత కొద్ది రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉండడంతో.. పార్టీ వీడుతున్నారనే ప్రచారం కూడా ఎక్కువగా కొనసాగింది . అయితే తాను పార్టీను వీడడం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇదే సమయంలో జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ప్రచారం చేసేలా అయితే కనిపించడం లేదు.


విశాఖకు వచ్చిన చంద్రబాబుతో బండారు సమావేశమైన తర్వాత తనకు సీటు ఇవ్వకపోవడం పైన ఆవేదన వ్యక్తం చేశారు.. దీంతో చంద్రబాబు నచ్చచెప్పి బండారుకు మాడుగుల ఇచ్చే  అంశం పైన చర్చ జరిగినప్పటికీ.. తాను మాత్రం మాడుగుల నుంచి పోటీ చేయననే విషయాన్ని తేల్చి చెప్పారట బండారు.. పెందుర్తి సీటు మొదటి నుంచి టిడిపికి కంచుకోటగా ఉందని.. దీంతో ఆ సీటు ఏకపక్షంగా జనసేనకు కేటాయించడంతో ఆవేదన చెందుతున్నట్లుగా చంద్రబాబుతో బండారు సత్యనారాయణ తెలియజేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఈ విషయం పైన ఫైర్ అవుతూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడం ఏంటి?ప్రచారంలో పాల్గొనక పోవడం ఏంటి? అంటూ బండారు పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట బాబు.. దీంతో వెంటనే బండారు మనస్థాపానికి గురై చంద్రబాబుకు నమస్కారం పెట్టి మరి బస్సు నుంచి దిగి వెళ్లిపోయారట. ఈ రోజున తన మద్దతు దారులతో మాట్లాడి తదుపరి నిర్ణయం బండారు ఏం తీసుకుంటారు అనే విషయం ఇప్పుడు టిడిపి నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: