ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం  హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక్కడ గెలుపును మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయ్. గత రెండు దఫాలుగా ఇక్కడ బిజెపి గెలుస్తూ వచ్చింది. కిషన్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇలా బిజెపి పార్టీ సిట్టింగ్ స్థానంగా ఉన్న సికింద్రాబాద్లో కమలం పార్టీని దెబ్బ కొట్టి తమ పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతూ ఉన్నాయి.


 ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో తప్పకుండా హ్యాట్రి కొడతాను అంటూ నమ్మకంతో ఉన్నారు. కాగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాలలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇది అటు కారు పార్టీకి కలిసి వచ్చే అంశమని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.


 కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికొచ్చేసరికి అక్కడి ఓటర్లు బిజెపి వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ అన్ని స్థానాలలో బీఆర్ఎస్ గెలిచింది.  కానీ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఓటర్లు బిఆర్ఎస్ కి కాకుండా మరో పార్టీకి పట్టణం కట్టే అవకాశాలే ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారట. మరి ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారు అన్న విషయం ఎవరికీ తెలియదు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp