జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోయిన అసెంబ్లీ ఎన్నికలలో గాజువాక , భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులైన టీసీ నాగిరెడ్డి (గాజువాక) చేతిలో 16,753 ఓట్లు , గ్రంధి శ్రీనివాస్‌ (భీమవరం) చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ రెండిటిలో ఒకదాంట్లో అయిన పవన్ గెలుస్తాడు అని అంతా భావించారు. కానీ రెండింటిలో ఓడిపోవడంతో కూడా పవన్ ఓడిపోవడంతో తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. ఇక ఈ రెండు ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ పవన్ వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుండే పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 

అలాగే దాదాపు పార్టీ నేతలు కూడా పవన్ మళ్లీ భీమవరం నుండి పోటీ చేయబోతున్నట్లు బాగానే కవర్ చేస్తూ వచ్చారు. ఇక చివరకు భీమవరం నుండి కాకుండా కేవలం కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో మాత్రమే పవన్ పోటీలోకి దిగారు. ఇక ఇక్కడి రాజకీయ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ కి ఈ ప్రాంతంలో మంచి మంచి పట్టు ఉంది. ఈయన 2014 వ సంవత్సరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అయ్యాడు.

ఇక ఆ తర్వాత ఈయన 2019 వ సంవత్సరం టీడీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత వర్మ ఈ ప్రాంత టీడీపీ పార్టీ ఇన్ చార్జి గా వ్యవహరిస్తున్నాడు. ఈయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ ప్రాంతం నుండి సీటు తనకే దక్కుతుంది అని ఆశ భావం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఇక చివరకి ఇక్కడి రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ఇవ్వడంతో వర్మ చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారు.

కాకపోతే ఈయన కూటమిలో భాగంగా ప్రస్తుతం పవన్ కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇదంతా బయట కనిపించేదే అని లోపల మాత్రం ఈయనకు వేరే ఉంది అని అనేక వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ గెలిచినట్లు అయితే అంతా తన క్రెడిట్ గానే ప్రాజెక్ట్ చేసుకుంటాడు అని ఒక వేళ ఓడిపోయినట్లు అయితే వర్మ తనకు వెన్నుపోటు పొడిచాడు అనే భావాన్ని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది అని వర్మ కేడర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనాప్పటికీ ఈ ప్రాంతంలో మాత్రం వర్మ కెరియర్ చాలా వరకు ముగిసినట్లే అని చాలా మంది ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: