బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరు అయినటువంటి హరీష్ రావు తాజాగా గద్వాల లోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షకు మద్దతు తెలిపారు. గద్వాల గొంతు తడపడానికి జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షకి నేను మద్దతు తెలుపుతున్నాను.  

అలాగే ఇతర నేతలకు కూడా నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని తెలిపారు. వేసవిలో నీటి కష్టాలు వస్తాయని ముందే గ్రహించిన కృష్ణమోహన్ రెడ్డి ప్రజలందరి కోసం ఈ దీక్ష చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఈ దీక్షకు వచ్చి మద్దతు సంపూర్ణ పలికారు ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కర్నాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. రేవంత్ కర్నాటకతో మాట్లాడి 5 టీఎంసీల నీరు తీసుకురావొచ్చు కదా అని హరీష్ ప్రశ్నించారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో ఇలా మంచినీళ్ల కోసం ఒక్క ఎమ్మెల్యే అన్నా ఎక్కడన్నా దీక్ష చేసిండా..? ఈ రకంగా మహిళలు రోడ్డపైకి వచ్చారా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా కాంగ్రెస్ మార్పు తేలేదు, పాత పాలనను తీసుకొచ్చింది. కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాలు తమ పాలనలో పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశాయి. అదే బీఆర్ఎస్ హయాంలో కల్వకుర్తి , నెట్టెంపాడు తదితర ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ రైతుబంధు వంటి ఎన్నో పథకాలు అమలు చేశారు.  

కాంగ్రెస్ ఎన్నికల్లో బాగంగా ఎన్నో హములు ఇచ్చింది. కానీ అవి ఇప్పుడు మర్చిపోయారు. ఆసరా పింఛన్ 4 వేలు పెంచుతామని మోసం చేసింది. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ను గ్యారంటీగా ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకుంది బీజేపీ. బీజేపీకి రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే రుణమాఫీ చేయాలి. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి. రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారనే బీజేపీ దొంగదీక్షలు చేస్తోంది. కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే. రేవంత్ కుర్చీ కాపాడుకోవడానికి బీజేపీతో మిలాఖత్ అయ్యాడు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ మెడలు వంచి అమలు చేయించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ను గెలిపించాలి. నాగర్ కర్నూల్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి అని హరీష్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hr