పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితమే జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా 2014వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ పోటీలోకి దిగింది. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన ఈ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలలో తమ అభ్యర్థులను బరిలో ఉంచింది. కాకపోతే ఈ పార్టీ నుండి పోటీ చేసిన ఒకే ఒక వ్యక్తి గెలిచారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేయగా రెండింటిలో కూడా ఓడిపోయాడు. పోయినసారి ఈ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగలడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తన పందాను మార్చుకున్నాడు.

ఒంటరిగా వెళ్తే పని కాదు అని అనుకున్నాడో ఏమో కానీ ఈసారి తెలుగుదేశం, బీజేపీ లతో పాటు పొత్తులో పోటీ చేయబోతున్నాడు. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలలో పోటీలోకి దిగబోతుంది. అంతా బాగానే ఉంది కానీ జనసేన కి పార్టీ గుర్తు విషయంలోనే పెద్ద చెక్కు వచ్చి పడింది. జనసేన గాజు గ్లాస్ మా గుర్తు అంటూ ప్రకటించుకున్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఇది శాశ్వత గుర్తు కాదు. ఎందుకంటే.. జ‌న‌సేన పార్టీ శాశ్వ‌త గుర్తింపు ఉన్న పార్టీ కాదు.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ఏ ఎన్నిక జ‌రిగిన గుర్తు కోసం పోరాడే ప‌రిస్థితి వ‌చ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం గాజు గ్లాస్ గుర్తు కోసం జనసేన ఎంతో పోరాడి దానిని దక్కించుకుంది. గుర్తింపు ఉన్న పార్టీలకు గుర్తుకోసం ఎలాంటి బెంగ ఉండదు. కానీ గుర్తింపు లేని పార్టీలు ఎప్పటికప్పుడు గుర్తుల కోసం అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొంతకాలం క్రితం ఎన్నికల కమిషన్ గుర్తుల కోసం ప్రకటన ఇచ్చింది.

అందులో భాగంగా ఎవరు అయితే ముందుగా వచ్చి గుర్తుకోసం అప్లికేషన్ పెడతారో ఆ గుర్తును వారికే కేటాయిస్తాం అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక గాజు గ్లాస్ గుర్తు కోసం పోయిన సంవత్సరం డిసెంబర్ 12 వ తేదీన జనసేన పార్టీ అప్లికేషన్ పెట్టుకుంది. ఆ తర్వాత డిసెంబర్ 20వ తేదీన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కూడా గాజు గ్లాస్ గుర్తుకే అప్లికేషన్ పెట్టుకుంది. దానితో ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దానితో ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుగా మేమే అప్లికేషన్ పెట్టాము.

అయినా మాకు ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించలేదు అని కోర్టుకు ఎక్కింది. ఇక కోర్టులో అనేక వాద ప్రతిపాదనల తర్వాత జనసేన పార్టీనే ముందుగా గాజు గ్లాస్ కోసం అప్లికేషన్ పెట్టుకుంది అని కోర్టు భావించడంతో గాజు గ్లాస్ గుర్తుని నెక్స్ట్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీకి కేటాయించింది. ఇలా గాజు గ్లాస్ గుర్తు కోసం జనసేన ఎంతో పోరాడి గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: