ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి "వై సీ పీ" పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రను జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ బస్సు యాత్ర ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాలను పర్యటించాడు. అలా పర్యటిస్తున్న సమయం లోనే జగన్ పై ఎవరో గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు.

అందులో ఆయనకు గాయాలు అయ్యాయి. దానితో వెంటనే జగన్ ను ఆసుపత్రికి తరలించగా ... గాయాలను పరిశీలించిన వైద్యులు జగన్ కి కొంత కాలం విశ్రాంతి అవసరం సూచించారు. కానీ జగన్ మాత్రం డాక్టర్లు చెప్పిన విశ్రాంతి తీసుకోకుండా కేవలం ఒక్క రోజు రెస్ట్ తీసుకొని మళ్లీ బస్సు యాత్రను ప్రారంభించాడు. అందులో భాగంగా రెస్ట్ తరువాత నిన్న జగన్ కొన్ని ప్రాంతాలను పర్యటించారు.

ప్రస్తుతం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు యాత్రను చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న ఈ బస్సు యాత్రకు ఈ రోజు బ్రేక్ పడింది. ఎందుకు అనుకుంటున్నారా..? ఈ రోజు శ్రీరామనవమి కావడం తో బస్సు యాత్రకు జగన్ ఈ రోజు బ్రేక్ వేశారు. దానితో నిన్న బస్సు యాత్రను పూర్తి చేసుకున్న జగన్ తణుకు తేతలి లో రాత్రి బస చేశారు. ఇక బుధవారం రాత్రి కూడా జగన్ తణుకు తేతలి లో బస చేయనున్నాడు. ఇక గురువారం ఉదయం జగన్ బస చేసిన ప్రదేశం నుండి తూర్పుగోదావరి జిల్లా వెళతారు.

రేపు రావులపాలెం నుండి జగన్ బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. అందులో భాగంగా రావులపాలెం జాతీయ రహదారిపై జగన్ రోడ్ షో జరగనుంది. పొట్టిలంక నుంచి బుర్రిలంక మీదుగా వేమగిరి వరకు జగన్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. వేమగిరి నుంచి గోరంపూడి మీదుగా రాజమండ్రి సిటీలోకి ఈ రోడ్ షో రానుంది. ఇక ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు తిరిగి నూతన ఉత్సాహంతో జగన్ బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్ళనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: