ప్రస్తుతం ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హోరాహోరీగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అటు ముంబై ఇండియన్స్ ఆట తీరుపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ ను కాదని హార్థిక్ పాండ్యా చేతికి సారధ్య బాధ్యతలను అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం. అతను జట్టును ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి.


 హార్దిక్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అన్న విషయం తెలిసిందే. అతను జట్టులో ఉన్నాడు అంటే ఒక అదనపు బౌలర్ అవసరం ఉండదు. దీంతో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తీసుకునేందుకు  ఛాన్స్ ఉంటుంది. కానీ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హార్దిక్ బ్యాటింగ్లో పర్వాలేదు అనిపిస్తున్న.. బౌలింగ్ లో మాత్రం ఎక్కువగా రాణించలేకపోతున్నాడు. మొదటి రెండు మ్యాచ్లలో మినహా మిగతా మ్యాచులలో అతను ఒకటి రెండు ఓవర్లు మాత్రమే వేసి సైలెంట్ గా ఊరుకోవడం గమనార్హం. దీంతో  గాయం నొప్పి వేధిస్తున్న హార్దిక్ బయటకు చెప్పట్లేదు అనే ప్రచారం రూపొందింది.


 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ అటు హార్దిక్ పాండ్యా కు ఒక విషయంలో వార్నింగ్ ఇచ్చి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కాలి అంటే హార్దిక్ పాండ్యా రెగ్యులర్ గా బౌలింగ్ చేయాల్సిందే అని బిసిసిఐ కండిషన్ పెట్టిందట  టీమిండియా కెప్టెన్ రోహిత్, శర్మ హెడ్ కోచ్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ ఈ విషయాన్ని సూచించారట. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న  హార్దిక్ అటు బౌలింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇకపోతే ఇదే టైంలో రోహిత్ శర్మ ఒక సాదాసీదా ఆటగాడిగా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: