తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గక ముందే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా తమదైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి పార్టీలు. ఇక అభ్యర్థులు అందరూ కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  ఇక ఈసారి నిజాంబాద్ లోక్సభ స్థానంలో ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ కూతురు కవిత నిజాంబాద్ నుంచి ఎంపిక ఎన్నికయ్యారు. కానీ పసుపు బోర్డు సాధించడంలో ఆమె విఫలం కావడంతో ఇక 2019 ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించారు.


 ఆయన హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు సాధించడం విషయంలో ఒకింత విజయం సాధించారు. అయితే ఇక ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన కూతురు కవితను ఓడించిన ధర్మపురి అరవింద్ ని ఓడించడమే లక్ష్యంగా ఇక ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ ఒక కీలకమైన నేతను బరిలోకి దింపాడు అన్నది తెలుస్తోంది. గతంలో ధర్మపురి అరవింద్ తండ్రిని  ఓడించిన బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు.


 నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ను ఓడించారు బాజిరెడ్డి గోవర్ధన్. తండ్రిని ఓడించిన వ్యక్తినే ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొడుకుని ఓడించేందుకు బరిలోకి దింపింది. గతంలో తండ్రిని ఓడించినట్లుగానే ఇప్పుడు కొడుకును కూడా ఓడిస్తానని బాజీ రెడ్డి గోవర్ధన్ ప్రస్తుతం ధీమాతో ఉన్నారు. కాగా ఇక్కడ అటు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs