ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న ఇంకా టికెట్ల విషయంలో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు.టికెట్ల చిచ్చు ఇంకా టీడీపీలో కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ కూటమిగా ఏర్పడిన తర్వాత చాలామంది సీనియర్ నాయకులకు టికెట్లకు దూరం అవ్వాల్సి వచ్చింది.దాంతో అలాంటి వారందరు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వైపు టీడీపీలో వర్గపోరు కూడా తారస్థాయికి చేరింది.సొంత నేతల మధ్య అధిపత్య పోరు అనేది కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.చాలా మంది ఇప్పటికే టికెట్ విషయంపై పార్టీ నుండి బయటకు వచ్చారు.కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.అయితే అలాంటి వారిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కీలక నేతలైనా గుండా దంపతులు క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.గతంలో వారు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా కూడా పని చేశారు.

అయితే అలాంటి వారికీ ప్రస్తుతం జిల్లాలో వారి పరిస్థితి అయోమయంలో పడిందనే చెప్పాలి. వారికీ పార్టీ కీలక నేతైనా అచ్చెన్నాయుడుతో తీవ్ర విభేదాలున్నాయి.అచ్చెన్నాయుడు జిల్లాలో తమని అణచి వేస్తున్నారంటూ,తమకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని గుండా దంపతుల వర్గం ఆరోపించింది. గుండ వర్గం ఆరోపిస్తోంది.అయితే
గుండ లక్ష్మీదేవిని పక్కన పెట్టి గొండు శంకర్‌‌కు చంద్రబాబు టికెట్ కేటాయించారని దీనికి కారణం కూడా అచ్చెన్నాయుడు అని గుండా వర్గం ఆరోపిస్తోంది.ఇటీవల చంద్రబాబును కలిసిన గుండా దంపతులు ఒక అనూహ్య నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.అయితే వారికీ టికెట్ విషయంపై చంద్రబాబు క్లియర్ గా చెప్పేశారు.ప్రస్తుతం ఉన్న సమీకరణాన్ని బట్టి శ్రీకాకుళం అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని, టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేయాలని ఆ దంపతులకు చంద్రబాబు చెప్పారట.చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న దంపతులు తాము క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అని వారి వర్గం ప్రకటించింది.అయితే వారి నిర్ణయం అనేది ప్రస్తుతం ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వారి నిర్ణయం అనేది రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: