తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పవర్ఫుల్ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీ నేతలు టైం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక ఆ ఎలక్షన్ లు ముగిసాయి. కొంత కాలం లీడర్లు అంతా సైలెంట్ అయిపోయారు. ఇక ఆ తర్వాత మళ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.

ఇక మళ్ళీ మొదలు... లీడర్లు అంతా మీరేం చేశారంటే మీరేం చేశారంటూ ఒకరిపై ఒకరు వాద ప్రతి వాదనలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ టాప్ లీడర్లు ఒకరు చేసిన కామెంట్లకు మరొకరు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కెసిఆర్ కూతురు కొన్ని రోజుల క్రితమే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. ఆమెను విడిపించడం కోసం ఆయన బీజేపీ తో కుమ్మక్కయ్యారు అని నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి అన్నారు.

దీనితో బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించిన కేటీఆర్ ఇప్పుడే చెబుతున్నా ఎలక్షన్ల అనంతరం రేవంత్ రెడ్డి బీజేపీ లోకి వెళతారు. అలాగే రేవంత్ భయం చూస్తే ఉంటే ప్రభుత్వం ఒక సంవత్సరమైనా ఉంటుందా లేదా అని నాకు అనిపిస్తుంది అని కేటీఆర్ అన్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా గట్టి కౌంటర్ వచ్చింది.

కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల పునాదులు కూడా లేకుండా చేస్తామని ఆయన వారిని కౌంటర్ ఇచ్చారు. ఇలా బీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు వాత ప్రతి వాదనలు చేస్తూ ఉంటే బీజేపీ మాత్రం ఇదంతా పెద్ద డ్రామా అని... బీజేపీ ఆపేందుకు కెసిఆర్ , కేటీఆర్ , రేవంత్ రెడ్డి ఓ డ్రామా ను ప్లే చేస్తున్నారు అని మీరు వారిని కొట్టి పారేస్తున్నారు. ఇలా ప్రస్తుతం తెలంగాణ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: