తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన క్యాండిడేట్ ల లిస్ట్ ను కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇక దీనిపై కొంత మంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. మోత్కుపల్లి ... కాంగ్రెస్ పార్టీ లోక్ సభ క్యాండిడేట్ ల ఎంపిక విషయంలో మాదిగలకు తీవ్ర అన్యాయం చేసింది అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ లో మంచి గుర్తింపు కలిగిన పార్టీలు అయినటువంటి బీ ఆర్ ఎస్ , బీ జే పీ పార్టీలు మాదిగలకు చెరో రెండు టికెట్లు ఇచ్చాయి అని మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతల కుటుంబాల్లోనే రెండు , మూడు సీట్ లను కేటాయించారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్లు ఇవ్వడం విషయంలో చాలా పొరపాట్లను చేసింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా నిరసన తెలిపేందుకు కూడా రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌ తో గురువారం 10 గంటల నుంచి 5 గంటల వరకు తన ఇంట్లోనే దీక్ష చేయబోతున్నట్టు మోత్కుపల్లి తెలిపారు.

రేవంత్ రెడ్డి సీఎం కావాలి అని కోరుకున్న వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని అని కాకపోతే అలా కోరుకున్న నాకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అని ఈయన చెప్పుకొచ్చాడు. మాదిగలకు తక్షణమే న్యాయం చేయకపోతే దాని వల్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా ఈయన స్పష్టం చేశాడు. మరి ఈయన అసహనం , నిరసనలతో వల్ల కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ ప్రాంతంలోని లోక్ సభ సీట్ లలో రెండింటిని మాదిగలకు ఇస్తుందా..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: