దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి కనబడుతుంది. మూడోసారి పవర్ లోకి రావాలి అని బీజేపీ పార్టీ తన శక్తి మొత్తాన్ని పెట్టి పోరాడుతూ ఉంటే... ఎలాగైనా ఈ సారి తమ ఉనికిని భారీగా చూపెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతుంది. ఇక ప్రతుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం కేరళ రాష్ట్రంలో ప్రచారాలను నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా ఈయన తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ... దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీకి అంత పట్టు ఉండదు.

బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంలో తమ ఉనికిని చూపించడం కోసం ఎంతో ప్రయత్నిస్తుంది అని... కాకపోతే ఈ ప్రాంతంలో వారికి అంత మైలేజ్ వచ్చే ఛాన్స్ లేదు. మొత్తం దక్షిణ భారతదేశంలో 130 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందులో 15 వరకు బీజేపీ కి వచ్చే అవకాశం ఉంది. అంతకుమించి ఈ ప్రాంతంలో వారికి సీట్లు రావు అని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేరళ , తమిళ నాడు , తెలంగాణ , ఏపీ ఇలా అన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి...  దక్షిణాది రాష్ట్రాలలో తన ఉనికిని విస్తరించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది.

అందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి గత కొన్ని వారాల నుంచి ఆ రాష్ట్రాలలో వరుస పర్యటనలు చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశం నుండి మాకు 115 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి దక్షిణ భారతదేశం చాలా పట్టు ఉన్న ప్రాంతం. దానితో బీజేపీ నీ ఓడించేందుకు ఇదే మాకు కీలకంగా మారబోతుంది. ఇక కేరళలో మొత్తం 20 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 20 కూడా కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. ఇక్కడ  బీజేపీ కి డిపాజిట్లు కూడా రావు. అలాగే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందులో 14 వరకు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: