కూటమిలో భాగంగా ఈసారి టిడిపి జనసేన బిజెపి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు.. అయినా కూడా టిడిపి పార్టీలో ఇప్పటికీ సీట్ల విషయంలో తర్జనభజన జరుగుతూనే ఉంది. అనపర్తి సీటు వాస్తవానికి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోది. అదే రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గపు ఎంపీ కాండేట్ని శాసించేది.. అట్లాంటి సీటు ఎందుకు తీసుకుంది పురందేశ్వరి అనే విషయం అందరిలోనూ సందేహంగా మారుతోంది. ఒకవేళ బిజెపి లిస్టులో ఆ సీటు కావాలని రాయాల్సిన పనిలేదని కూడా తెలుస్తోంది.
అయితే రాజమండ్రి పార్లమెంటు సీటు ఎందుకు తీసుకుందంటే.. సోమువీర్రాజుని అక్కడ పోటీ చేపిచ్చి.. ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేయడం కోసమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. చంద్రబాబు నాయుడు కూడా ఈ సీటును అందుకే  ఇచ్చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. నల్లబెల్లికి ఇవ్వాలంటే అనపర్తి సీటు ఉన్నప్పటికీ ఎందుకు మీరు అక్కడ గెలవరని చెప్పి ఆ సీటు ఇవ్వకుంటే సరిపోతుండే.. కూడా నివేదికలన్నీ అయిపోయిన తర్వాత.. అందరూ కలిసి ఏకగ్రీవం చేసి.. ఒక మాజీ సైనికుని కన్ఫామ్ చేసిన తర్వాత.. ఇప్పుడు ఆయనను మార్చేయాలనుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా టిడిపి గట్టిగా ఆ సీటును అడుగుతోంది కాబట్టి ఆ సీటు బిజెపి ఇవ్వాలని చూస్తోంది. బిజెపి కూడా అక్కడ తమకు సరైన కాండిడేట్ లేరని మేము తీసుకుంటున్నామంటూ టిడిపి చెబుతోంది.అక్కడ సోము వీర్రాజు పోటీ చేయకపోవడంతో శివకృష్ణ రాజుకు సీటు వచ్చింది. ఆయనను ఇప్పుడు తీయాలి అంటే.. ఈయనకు ఎక్కడ సీట్ ఇవ్వాలని ప్రశ్న మొదలైంది. తంబళ్లపల్లె ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమైతే.. వద్దని చింతమనేని ప్రభాకర్ కు సంబంధించి దెందులూరు అడుగుతున్నట్లు తెలుస్తోంది పురందేశ్వరి. ఈ సీటు ఎవరికోసమంటే తపనా చౌదరి కోసం.. దీంతో ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను కలిపితే కమ్మ సామాజిక వర్గానికి 40 శాతం వరకు సీట్లు ఇచ్చారని వాదన కూటమిలో వినిపిస్తోంది. దీంతో అటు కూటమిలో కూడా సీట్లన్నీ కమ్మ సామాజిక వర్గానికేనా కాపు సామాజిక వర్గానికి ఇవ్వరా అని వాదన కూడా వినిపిస్తోంది. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం పురందేశ్వరి మరిది గారికి సంబంధించినటువంటి అడుగుజాడలలో ఆయన కోసమే పనిచేస్తుందని వార్తలు వినిపించేలా చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: