రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది.వివిధ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్కి సబ్మిట్ చేసారు. ఈ సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు టీడీపీలో పోటీ చేసే అభ్యర్దుల మార్పు పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే నర్సాపురం ఎంపీ టికెట్ నామినేషన్ విషయానికి వస్తే బీజేపీకి వెన్నుపోటు పొదవడం లేదా గుండెపోటు తెప్పించడం లేదా తన అహాన్ని తీర్చుకోవడంలో రఘురామకృష్ణ రాజు ఇంకొక అడుగు ముందుకు వేశారు.ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తే మొదట్లో ఆయనకు కూటమి తరపున ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ఇష్టం చూపలేదు. అయితే దానికి ఆయన నాకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ కండువా కప్పుకుంటానని చెప్పాడు.అయితే చివరకి ఆయనను గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు రఘురామ రాజును ఉండి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు.ఉండి అభ్యర్దిగా ప్రకటించిన రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.కానీ రఘురామ మాత్రం నర్సాపురం టికెట్ ఎలాగైనా సరే చంద్రబాబు ఇస్తారనే ఆశతో ఉన్నాడు.అయితే చంద్రబాబు ఆయన్ను నరసాపురం సిట్టింగ్ ఎంపీ స్థానం నుండి మార్చి అదే జిల్లా పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించింది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారు.

ఒకవైపు కూటమి తరపున బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ నర్సాపురం నుండి నామినేషన్ వేస్తె దానికి పోటీగా రఘురామ అతని కొడుకు అయినా కనుమూరి భరత్ చేత నామినేషన్ వేయించాడు.ఉండి టికెట్ పై రఘురామకు ఉత్కంఠ విడకపోవడంపై రఘరామా ఇలాంటి పని చేసాడు.దాంతో ఆయన టీడీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారా? లేదా బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారా? అనేది తెలియడం లేదు. ఒకవైపు కూటమిలో ఉంటూనే బీజేపీకి ప్రత్యర్దిగా తన కొడుకుని దించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: