ఏపీలో ఇప్పటికే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో కూడా పార్టీ అధినేతలు దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ రానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఆయన రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.అయితే దానికి సంబంధించి సభా స్థలాలు ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రాథమికంగా అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప లేదా రాజంపేట, మరోచోట సభలు ఉంటాయని టీడీపీ చెబుతోంది. దానికి సంబందించి వేదికలు ఖరారయ్యాక బీజేపీ పెద్దలతో సంప్రదించి తేదీలు ఫైనల్ చేసే పనిలో టీడీపీ అధిష్టానం ఉంది.ఒకవైపు కూటమి నేతల్లో భయం కూడా వారిని వెంటాడుతుంది దానికి కారణం చిలకలూరిపేటలో గత నెలలో పెట్టిన సభ అట్టర్‌ఫ్లాప్ అవడమే.

ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, పురందేశ్వరి కలిసి పాల్గొంటున్న సభలకు జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడం కూడా వారిలో భయానికి కారణం. చిలకలూరిపేట సభలో జనం లేకపోవడంతో మోడీ ముందు పరువు పోయినట్లు అనిపించింది. అలాంటి ఈ పరిస్థితుల్లో నాలుగు సభలకు, అదీ మండుటెండల్లో జనాన్ని తరలించడం వారికీ తలకు మించిన భారమేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఒకవేళ మోడీ ద్వారా సభ పెట్టకపోతే జనం తమ పొత్తుకు మోడీ ఆశీర్వాదం లేదని అనుకుంటారని  మరోవైపు ఆందోళన చెందుతున్నారు. అలాగని సభలు పెట్టించాక జనం రాకపోతే మోడీ ముందు ఇంకోసారి పరువు పోతుందని బాబు, పవన్ టెన్షన్ పడుతున్నారు.

ఇదిలావుంటే ఇంకోవైపు కూటమిలో ఒక పార్టీ పోటీ చేసేచోట మిగిలిన రెండు పార్టీల అభ్యర్థులూ మరియు నేతలు పూర్తిస్థాయిలో ప్రచారానికి రావట్లేదు. వాళ్లు పిలిస్తే వెళతామన్నట్లు వాళ్ల వ్యవహరశైలి కనబడుతుంది.అయితే ఏదో పిలిస్తే తప్ప కూటమి విజయం సాధించాలనే కసి మిగిలిన రెండు పార్టీల కార్యకర్తల్లో కనిపించట్లేదన్నది ఎన్డీఏ అభ్యర్థుల ఆవేదన.అయితే ఇటువంటి పరిస్థితుల్లో మోడీ సభలకు మూడు పార్టీల కార్యకర్తలనూ ఎలా తీసుకురావాలోతెలియక బాబు, పవన్‌, పురందేశ్వరి పరేషాన్ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: