కాంగ్రెస్ ఈ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు  ఈ నాయకుడు ఏం చేయాలన్న  తప్పనిసరిగా ఢిల్లీ ఆదేశాలు ఉండాల్సిందే. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీలో ఎప్పుడు ఏదో ఒక కయ్యం  నడుస్తూనే ఉంటుంది.  అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది..వీరు అధికారం చేపట్టి  కొన్ని నెలలు కూడా గడవకముందే  నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పార్లమెంటు ఎలక్షన్ కు సంబంధించి  ఎలాగైనా అన్ని సీట్లలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయాలని ఆలోచిస్తున్న తరుణంలో  నేతల మధ్య ఏర్పడుతున్న ఆధిపత్య పోరు కాంగ్రెస్ ను దిగజార్చుతోందని చెప్పవచ్చు.  

అయితే తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు మధ్య  విపరీతమైనటువంటి పోరు జరుగుతోంది. ఇదే తరుణంలో హనుమంతరావు  మల్లు భట్టి విక్రమార్కను కడిగిపారేశారు. తనకు ఖమ్మం టికెట్ రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని నేను మాట్లాడినందుకు ఆయన నాపై కక్షగట్టారని అన్నారు. ఆనాడు అన్న మల్లు అనంత రాములు మరణిస్తే  మల్లు రవిని  నేనే పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి భరోసా ఇచ్చానని, ఆ టైంలో మల్లు భట్టి విక్రమార్క  తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కొరకు నా కాలు కూడా పట్టుకున్నారని ఆరోపించారు.

వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చానని కనీస విశ్వాసం కూడా చూపించకుండా నాకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్రలు పన్నుతున్నారని తెలియజేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, నేను బట్టిని సొంత తమ్ముడిలా భావించినా కానీ ఆయన నాపై కుట్ర చేయడం  సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నేను బిజెపికి సపోర్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో నాపై అసత్య  ప్రచారం జరుగుతోందని  అలా ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని  ఆయన అన్నారు. అసత్య ప్రచారాన్ని అరికట్టడం కోసం సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్టు విహెచ్ వెల్లడించారు. పార్లమెంటు ఎలక్షన్స్ త్వరలో జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతల మధ్య కయ్యం అనేది ఎలక్షన్స్ ను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: