ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్న సమయంలో కూటమిలో భాగంగా జనసేన ,టిడిపి, బిజెపి పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించాయి.. కానీ ఇప్పుడు తాజాగా సీట్ల మార్పు పైన పలు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఎనిమిది సీట్లలో టిడిపి అభ్యర్థులను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపితో రెండు సీట్ల పైన సర్దుబాటు చేసే విధంగా పలు రకాల ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి బిజెపి సీట్ల పైన ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.


తాజాగా అనపర్తి సీటు విషయంలో టిడిపి పట్టుబడుతున్న సీటు వదులుకోవడానికి బిజెపి మాత్రం ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా అనపర్తి సీటును మాజీ సైనికుడు శివ కృష్ణంరాజుకు టికెట్ కేటాయించారు. నాలుగు సంవత్సరాలు పాటు పార్టీని బలోపేతం చేయడంపైనే కృషి చేశారు. కానీ ఇలాంటి మాజీ సైనికుడిని తీవ్రంగా అవమానించడం నడిరోడ్డు మీద ప్రచారానికి వెళ్ళినప్పుడు మెడలో నుంచి కండువాలు పీకేసి ఎవరు మీరు మా కండువా వేసుకోవడానికి అంటూ టిడిపి అక్కడి నేతలు అవమానిస్తున్నారట. ఇలాంటి విషయాలను ఖండించలేనటువంటి అసఖ్యత అసమర్ధత బిజెపి పార్టీలో కనిపిస్తోంది. ఈ విషయంలో  సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మాజీ సైనికుడు శివ కృష్ణంరాజును మార్చాలంటూ నిర్ణయించుకోవడం.. అక్కడున్నటువంటి నల్లమిల్లి నీ పక్కన పెట్టుకొని తిరుగుతోంది పురందేశ్వరి. నల్లమిల్లికి టికెట్ కావాలంటే బిజెపిలోకి చేరితే ఇస్తామన్నట్టుగా తెలియజేసినట్లు అక్కడి నేతలు నుంచి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది.దీంతో మాజీ సైనికుడు శివకృష్ణంరాజు ఆగ్రహాన్ని తెలియజేశారు. సైనికుడిగా పనిచేసిన శివ కృష్ణంరాజుకు హిందీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో తను మాట్లాడిన మాటల విషయానికి వస్తే.. ఒక సైనికుడిని ఇలా అవమానించడం కరెక్టేనా.. ఇలాంటి పరిస్థితి బీజేపీలో ఎప్పుడైనా ఉందా. సిగ్గుండాలని చెప్పి పరోక్షంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. తను ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ ప్రకటించారు. 22వ తారీఖున నామినేషన్ వేస్తానంటూ తెలిపారు. దీని ద్వారా అటు చంద్రబాబుకు, పురందేశ్వరికి, నల్లమిల్లికి అందరికీ షాక్ ఇచ్చిన పరిస్థితి కనపడుతోంది. మరి ఇప్పుడు ఈ సీటును నల్లమిల్లికి ఇస్తే నియోజవర్గ ఫలితంలో కీలకంగా కానుంది.. అసలు అనపర్తి సీటు పైన తుది నిర్ణయం ఏంటి అనే విషయం పైన ఆసక్తి నెలకొంటోంది. దీన్నిబట్టి చూస్తే కూటమిలో బీటలు పారేలా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: