బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడు అయినటువంటి హరీష్ రావు తాజాగా గజ్వేల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈయన తాజాగా రేవంత్ రెడ్డి మెదక్ సభలో చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజా మీడియా సమావేశంలో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ... తాజాగా జరిగిన మెదక్‌ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన మూర్ఖత్వాన్ని చాటుకున్నాడు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్నాడు. వారు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్‌లో మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి, ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.

ఎన్నో సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ మెదక్‌ కి ఏం చేసింది..? మెదక్‌ ను అభివృద్ధి చేసింది మేము. అలాగే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది... రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. మల్లన్నసాగర్ , కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు మా ప్రభుత్వం ఇచ్చింది. అలాగే కెసిఆర్ మూడు యూనివర్సిటీలు తీసుకొచ్చాడు. మెదక్‌లో ఏం అభివృద్ధి జరిగిందో కళ్లు పెద్దవి చేసి చూడు రేవంత్. లేకపోతే నువ్వొస్తే నేను చూపిస్తా అని హరీష్ రావు అన్నారు. మెదక్ , సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్న నువ్వు ఈ రోజు మా జిల్లా గురించి మాట్లాడుతావా..? సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అది కేసీఆర్ చలవే. ఉమ్మడి పాలనలో మెదక్ సింగూరు నీళ్లు తరలించుకుపోలేదా..? రాజకీయాల్లో విలువలు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో నీ ఎత్తు గురించి మాట్లాడడం లేదు.

కానీ నీకు నీ భాషలోనే మాట్లాడితనే అర్థం అవుతుంది.  మాటిమాటికి దూలమోలే పెరిగావ్ అంటున్నావ్. భూమికి జానెడు ఉన్న నీకు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదు అని నేననాలా?సీఎం పదవిలో ఉండి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావ్. పాత రాతియుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు రేవంత్ కేసీఆర్ మెదక్‌కు చేసిన అభివృద్ధి కనపడుతుంది అని తాజా మీడియా సమావేశంలో హరీష్ రావు, రేవంత్ మాటలకు కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: