ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి.. కేవలం స్టేట్ లీడర్ మాత్రమే కాదు దేశంలోనే ఒక స్టార్ లీడర్ గా మారిపోయారు. ఎందుకంటే తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైన సమయంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఒక వైపు సీనియర్ల నుంచి అవమానాలు ఎదురవుతున్న పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగారు.


 అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సైతం కలలో కూడా ఊహించని విధంగా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇలా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జర్నీలో రేవంత్ కి పార్టీ లోపల బయట ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదురయ్యాయి అనడంలో సందేహం లేదు. ఇలా కనుమరుగు అవుతుందనుకున్న  పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ ఇక ఇప్పుడు జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్నారు. దీంతో రేవంత్ చరిష్మాను మిగతా రాష్ట్రాలలో కూడా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇక మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార నిర్వహించేలా ఇప్పటికే అన్ని ప్లాన్స్ వేసుకుంటుంది.


 ఇప్పటికే ఎంతోమంది ఇతర రాష్ట్రాలకు కాంగ్రెస్ అభ్యర్థులు తమ కోసం రేవంత్ వచ్చి ప్రచారం చేయాలంటూ ఆహ్వానిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అంతెందుకు మొన్నటికి మొన్న ఏకంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం తాను పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గంలో రేవంత్ ని పిలిపించుకుని ప్రచారం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ అటు కేరళలో వయనాడ్ తరపున పోటీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతులు సమావేశంలో రేవంత్ పాల్గొని తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇక వారణాసి వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతుందని.. రాహుల్ ను గెలిపించాలని కోరారు. అంతేకాదు బిజెపి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే రేవంత్ వాగ్దాటి ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో తమ రాష్ట్రాలలో కూడా రేవంత్ తో ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: