తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ప్రచారాలు కూడా మొదలుపెట్టాయి. కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపీ బండి సంజయ్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. తనని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కైందని అన్నారు. అందుకే ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదని బండి సంజయ్ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణమని చెప్పుకొచ్చారు. నేతన్నలను కాంగ్రెస్ సర్కార్‌ ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రూ.270 కోట్ల బకాయిలు ఉన్నాయని కానీ రూ.50 కోట్లు మాత్రమే చెల్లించడం కంటి తుడుపు చర్య అని మండిపడ్డారు.

యార్న్‌ కొనుగోలులో అవినీతి జరుగుతోందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మంచి చేయలేదని అన్నారు. ప్రజల డబ్బులు దోచుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన హామీలతో ప్రజలకు ఆశ కలిగించి గెలిచిందని చెప్పుకొచ్చారు.

ఇటు రాష్ట్రం అటు కేంద్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించుకొని తీరాలని బండి సంజయ్ అన్నారు. బీజేపీ పాలనలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను గురించి ఎంపీ ప్రజలకు గుర్తు చేశారు. ఈసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీయే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని ఎంపీ కోరారు. గత ప్రభుత్వ అలాగే ప్రస్తుత ప్రభుత్వ మాటలను నమ్మి మోసపోవద్దని చెప్పుకొచ్చారు. ప్రజలకు అండగా ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికీ ఉంటారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp