కొన్ని రోజుల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో చాలా వరకు జనాలు బీఆర్ఎస్ పార్టీ నే ఈ సారి కూడా అధికారకం లోకి వస్తుంది ... కాకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో సీట్లను దక్కించుకుంటుంది అని భావించారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ కి సీట్లు పెరిగాయి. దానితో ఈ సారి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇకపోతే ప్రభుత్వాన్ని నెలకొల్పిన తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. వీటిలో కూడా ఎక్కువ సీట్లను సంపాదించి తన స్టామినాను మరోసారి నిరూపించుకోవాలి అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. 

అందులో భాగంగా మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇక ఈ సారి జరగబోయే లోక్ సభ ఎన్నికలలో భారీ సీట్లను దక్కించుకోవడం కోసం చాలా రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలను రేవంత్ పర్యటిస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నాడు. అందులో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఏ ప్రాంతాలను పర్యటించబోతున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ రోజు అనగా 22 ఏప్రిల్ 2024 వ తేదీన ఉదయం 11:00 గంటలకు అదిలాబాద్ లో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 01:00 గంటలకు నిజామాబాద్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. నిజామాబాద్ బహిరంగ సభను పూర్తి చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి  సాయంత్రం 04:00 గంటలకు మేడ్చల్ - మల్కాజిగిరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇలా ఈ రోజు మూడు బహిరంగ సభలలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నాడు. మరి ఈ సభలలో రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రసంగాన్ని ఇస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rr