ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల బరిలోకి బడా పారిశ్రామికవేత్తలు కూడా దిగుతున్నారు. అయితే అలాంటి వారెవరు కూడా తమ ఆస్తులను వేల కోట్లలో మాత్రం చూపించలేదు. ప్రస్తుతం పలువురు నియోజవర్గాలలోని అభ్యర్థులు తెలుపుతున్న తమ ఆస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా గుంటూరు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం తన ఆస్తి కొన్ని వేలకోట్ల రూపాయలు ఉన్నట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా ఈయనకు అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కూడా ఉన్నదట. మొత్తం మీద తనకు తన కుటుంబానికి రూ.5598 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.


అయితే ఇందులో స్థిరాస్తులు చరాస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా కలిగి ఉన్నాయని ఈ సమయంలోనే అప్పులు కూడా 1000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలియజేశారు. తిమ్మసాని చంద్రశేఖర్ ఎంబిబిఎస్ ఇక్కడే చదివినప్పటికీ పై చదువులకు అమెరికాకు వెళ్లారట. అక్కడ మెడిసిన్ లో బాగా స్థిరపడి.. యూవరల్డ్ అనే పేరుతో అమెరికాలో ఒక మెడిసిన్ ఎంట్రెన్స్ కు కోచింగ్ సెంటర్ ని నడుపుతున్నారు. వీటితో పాటు అక్కడ చాలా వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


పెమ్మసాని చంద్రశేఖర్ తన సొంత భూమికి ఏదైనా సేవ చేయాలని ఉద్దేశంలో తిరిగి మళ్ళీ ఆంధ్రాలోకి ఎంట్రీ ఇచ్చి టిడిపి తరఫున పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. చాలాకాలం అమెరికాలో ఉన్న చంద్రశేఖర్ తెలుగు కానీ ఇక్కడ పరిస్థితుల్ని ఆయన ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేవారట.. అందుకే ఆయనకు  పూర్తిస్థాయి అవగాహనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే  రాజకీయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. వచ్చిన రెండు వారాలలోని గల్లా జయదేవ్ నీ మించిన రాజకీయ నేతగా గుర్తింపు పొందేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం పెమ్మసాని ఆస్తులు టిడిపి అధినేత చంద్రబాబు ఆస్తులను మించి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల చంద్రబాబు ఆస్తులను కూడా ప్రకటించారు. ఆయన ఆస్తి మొత్తం 980 కోట్ల రూపాయలు అన్నట్లుగా అఫీడవిట్లో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: