సిద్దిపేట కింగ్ హరీష్ రావు

ఆరడుగుల బుల్లెట్టుకు అడ్డులేదు

మాస్ క్లాస్ లీడర్ గా రికార్డ్..


హరీష్ రావు  తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎంతో పేరుగాంచిన లీడర్. టిఆర్ఎస్ పార్టీలో  కేసీఆర్ తర్వాత అత్యంత ఆదరణ కలిగినటువంటి మాస్ క్లాస్ లీడర్ తన్నీరు హరీష్ రావు అంటారు. అలాంటి హరీష్ రావు కు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు. ఎప్పుడు ప్రజా శ్రేయస్సుకై పోరాడే హరీష్ రావు  సిద్దిపేట గడ్డపై వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.  తెలంగాణలో లక్ష మెజారిటీ దాటిన ఏకైక నాయకుడు హరీష్ రావు అని చెప్పవచ్చు. ఇలాంటి ఆరడుగుల బుల్లెట్  గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..

రాజకీయ ప్రస్థానం:
హరీష్ రావు సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో పుట్టి పెరిగారు. హరీష్ రావు 32 ఏళ్లకే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి  అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతున్నారు. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గం నుంచి 7సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.  2004లో తొలిసారిగా సిద్దిపేటలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన  పోటీ చేసి  24,829 ఓట్ల తేడాతో గెలుపొందారు. అదేవిధంగా రెండవసారి ఇదే స్థానం నుంచి మళ్లీ భారీ మెజార్టీతో గెలుపు సాధించారు.  2009 అసెంబ్లీ ఎన్నికలు సిద్దిపేట నుంచి మరోసారి పోటీ చేసిన హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థి బైరి అంజయ్య పై  64,677 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక 2010 ఉప ఎన్నికల్లో ఆయన తన స్థానాన్ని  అలాగే పదిలంగా ఉంచుకున్నారు.  2014 ఎన్నికల్లో కూడా సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు  1,20,650 ఓట్ల మెజార్టీతో సాధించి అతి చిన్న వయసులోనే  ఆరుసార్లు  వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన  నాయకుడిగా  చరిత్ర సృష్టించారు. అలాంటి హరీష్ రావు మళ్ళీ 2023 ఎన్నికల్లో కూడా అద్భుత మెజారిటీ సాధించారు.  కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు హరికృష్ణ, శ్రీకాంత్ రెడ్డి లపై 82,000 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు క్రియేట్ చేశారు.

పదవులు:
2004లో తొలిసారిగా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత  వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో యువజన సర్వీసులో, ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత  2019 నుండి తెలంగాణ ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 2014 మరియు 2018 మధ్య నీటిపారుదల మార్కెటింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

ప్రజా సేవలు:
హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను అత్యంత అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు.  అలాంటి హరీష్ రావుకు నియోజకవర్గంలో పోటీ ఇచ్చే నాయకుడే లేరు. ఒకవేళ పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్లు కూడా రావడం లేదు. నియోజకవర్గ మొత్తం హరీష్ రావు వెంటే ఉంటారు.  దీనికి ప్రధాన కారణం ఆయన చేసే ప్రజాసేవ. నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ ఏం జరిగినా హరీష్ రావు టక్కున అక్కడికి వెళ్తారు. నిరంతరం ప్రజాసేవకై పరితపించే ఏకైక లీడర్. నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకు డబుల్  బెడ్ రూమ్ అందించిన ధీరుడు అని చెప్పవచ్చు. సాధారణంగా చాలా మంది ప్రజలు నియోజకవర్గాల్లో వివిధ పార్టీలలో ఉంటారు.  కానీ ఈ నియోజకవర్గంలో 95 శాతం మంది ప్రజలు హరీష్ రావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వీరుంటారు.  అంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు నాయకుడే ముఖ్యం అనేది అర్థం చేసుకోవచ్చు. అందుకే హరీష్ రావు ఏకధాటిగా ఏడుసార్లు ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తూ అనేక పదవులు అలంకరించి సిద్దిపేటను దేశంలోనే అద్భుత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తయారు చేశారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: