తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సోషల్ మీడియా ద్వారా ఒక చిన్న వీడియో తో పాపులారిటీ సంపాదించుకుంది శిరీష అలియాస్ బర్రెలక్క.. బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అనే వీడియోతో హల్ చల్ చేసింది శిరీష. అయితే అనుకోకుండా ఎవరు ఊహించని విధంగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం పైన నిరసన, నిరుద్యోగుల నుంచి తన వంతు గలమెత్తిన బర్రెలక్క ఎన్నో అవమానాలను దాడులను కూడా ఎదుర్కొని మరి నిలబడింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినది.


అయితే ఓడిపోయింది శిరీష. ఆ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తానంటూ తెలియజేసింది. అంతలోనే ఆమె పెళ్లి హడావిడి లో ఉండిపోయింది.. వెంకటేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇక పెళ్లయింది కదా పొలిటికల్ కి దూరం అవుతుందని అనుకుంటున్నా సమయంలో అనుహ్యంగా తాను ఎంపీ ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్లు తన సోషల్ మీడియా నుంచి ఒకసారిగా ప్రకటించింది.


అందుకు తగ్గట్టుగా ముందుకు అడుగులు వేయబోతున్నానని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ బర్రెలక్క  ఈ రోజున కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలియజేసింది. తనను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి అంటూ ఒక వీడియో పోస్ట్ ను కూడా చేసింది.ఇప్పటికే ఈమె ప్రచారం కూడా మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి శిరీష ఎంపీ యుద్ధానికి మొదలైంది అంటూ ప్రచారంలో భాగంగా పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతున్నాయి. అలాగే ఎవరైనా కొత్తగా పొలిటికల్ పరంగా నామినేషన్లు వేయాలనుకునే వారికి నామినేషన్ పత్రాలు ఎక్కడ ఉంటాయి? ఎలా లభిస్తాయి అనే విషయాలను కూడా తెలియజేస్తోంది. గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా 5754 ఓట్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: