గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటాము అనుకున్న బిఆర్ఎస్ పార్టీకి భంగపాటి ఎదురైంది అన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలు హ్యాట్రిక్ కట్టబెడతారు అనుకుంటే చివరికి కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ కేవలం ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే  గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పార్టీలోని కీలక నేతలందరూ కూడా పార్టీని వీడుతూ ఉండడంతో ఆ పార్టీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయ్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇక బిఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మెజారిటీ స్థానాలలో గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక పార్టీలోని కీలక నేతలందరూ కూడా ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్ సొంత జిల్లా  మెదక్లో కూడా విజయాన్ని ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా  ఇక్కడ ఆ పార్టీ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పోటీ చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. కాగా గులాబీ పార్టీకి ఈ పార్లమెంట్ స్థానం కంచుకోటగా కొనసాగుతుంది. బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడ గులాబీ జెండా ఎగురుతూనే ఉంది. ఇక బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా భారీ తేడాలతో విజయాన్ని సాధిస్తూ వచ్చింది. ఇక బిఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన 2004 ఎన్నికల నుంచి 2019 వరకు దాదాపు 5 సార్లు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం లో గులాబీ పార్టీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు 2023పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిచి విజయ డంకా మోగించాలని అనుకుంటుంది ఆ పార్టీ. ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో లేకపోవడం.. పార్టీలో పరిస్థితులు పూర్తిగా ఆందోళనకరంగా ఉండటం.. ఇంకోవైపు ప్రత్యర్థి  పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడంతో ఈసారి బిఆర్ఎస్ డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Car