ఆంధ్రప్రదేశ్లోని నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది.. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల సైతం జోరుగా నామినేషన్లు వేస్తూ ఉన్నారు. దీంతో చాలా మంది నేతల ఆస్తులు, అప్పులు, విద్యార్హత, కేసుల వివరాలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అఫిడవిట్లో రూపొందించిన విషయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులకు ఆర్థిక పరిస్థితి వారిపై ఉన్న కేసులు రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా  టిడిపి పార్టీకి చెందిన ఒక నాయకుడు విషయంలో మాత్రం ఆయన పైన ఉన్న కేసులు విషయంలోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఆయన ఎవరో కాదు టిడిపి పార్టీ దెందులూరు నియోజవర్గం  అభ్యర్థి గా ఎన్నికలలో నిలుచున్న చింతమనేని ప్రభాకర్.. ఈయన  ఆస్తులు అప్పుల కంటే ఆయన పైన ఉండే కేసులె ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దాదాపుగా ఈయన పైన కేసులు సెంచరీకి చేరువగా ఉన్నట్లు తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ అభ్యర్థి పైన కూడా ఇన్ని కేసులు లేవని వార్తలు వినిపిస్తున్నాయి.. చింతమనేని ప్రభాకర్ పైన రౌడీషీటర్ తో పాటు దాదాపుగా 93 కేసులు ఉన్నాయని నామినేషన్ దాఖలో అఫిడవిట్లో తెలియజేశారు. చింతమనేని ప్రభాకర్ ఆస్తి 50 కోట్లకు పైగా ఉన్నట్లు తెలియజేశారు.


గతంలో తాసిల్దార్ వనజాక్షి ఉదాంతం పైన నమోదైన కేసులన్నీ తన ఆఫీడవిట్ లో కూడా వివరించారు. ఈయన పైన ఉన్న కేసులను చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఈయనలో మాత్రం దూకుడు తగ్గలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ ఈసారి ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో మరింత కష్టపడుతున్నారు. ప్రజల మద్దతు కోసం సాయశక్తుల  ప్రయత్నిస్తున్నారు చింతమనేని ప్రభాకర్. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీగా ఉన్నారు ఈ అభ్యర్థి.. ఆంధ్రప్రదేశ్ లోనే కేసులలో టాప్ గా మీరు చాలా చింతమనేని ప్రభాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: