భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యారు . అందులో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జనాలను ఏ విధంగా మోసం చేసి అధికారం లోకి వచ్చింది. ఎన్ని దొంగ హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే నెరవేరుస్తాను అన్న హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదు.

అలాగే రైతులకు ఎంతో అన్యాయం చేస్తున్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది..? మహిళలకు ఇస్తానన్న హామీలు ఏవి..? ఇలా అనేక విశాయలపై చర్చిస్తూనే మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అలాగే కాంగ్రెస్ పార్టీపై తనదైన రీతిలో విమర్శలను చేశారు. ఇక తాజాగా కేసీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారు. దానికి ప్రధాన కారణం ఓటుకు నోటు కేసులో ఆయనను నేను పట్టించాను.

ఆ కారణంతోనే ఆయన నాపై భారీగా కక్ష పెంచుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ఆనవాళ్లను తీసేస్తాము అని రేవంత్ అన్నారు. మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టింది. యాదాద్రి ఆలయం కట్టింది నేనే... కులగోడతారా..? కేసీఆర్ అంటే ఒక హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నా ఆనవాళ్లను తీసివేయడం ఎవరివల్లా కాదు అని కేసిఆర్, రేవంత్ ఫైర్ అయ్యారు.

అలాగే కాలేశ్వరం గురించి మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డిజైన్‌ నేను చేయలేదు. తనకు ఇంజినీరింగ్‌ భాషే తెలియదంటూ కేసీఆర్ తాజాగా పేర్కొన్నారు. దానిని తెలంగాణ అవసరాలకు తగ్గట్టు రీడిజైన్‌ చేశామని.. సమైక్యపాలనలోనే ఎత్తిపోతలకు అనుమతులు.. దశల వారీగా నీటిని ఎత్తిపోసేలా ప్లాన్‌ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఢోకా లేదు అంటూ కేసీఆర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: