తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని ప్రకటించింది. అలాగే అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ రోజుల్లోనే రుణమాఫీ చేస్తాము అని కూడా చెప్పుకొచ్చింది. ఇక పోయిన సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావలసిన దానికంటే ఎక్కువ సీట్లను సంపాదించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక ఎన్నో సంఘటనాల మధ్య రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించింది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాలలోపే ప్రతి ఒక్క తెలంగాణ రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు ఆ హామీ విషయంలో ఎలాంటి మాట లేదు అని విమర్శలను చేస్తూ వచ్చింది. దానితో కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి ఆగస్టు 15 వ తేదీ లోపు కచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తాను అని ప్రకటించాడు.

ఇక దానితో బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటివరకు ఇచ్చిన హామీలకే దిక్కులేదు. వీటిని నెరవేరుస్తాడా..? ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ లలో గెలవడం కోసం చెప్పే కల్లబొల్లి మాటలు అంటూ వాటిని కొట్టి పారేశారు. ఇక ఈ మాటలకు తాజాగా రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

తాజాగా రేవంత్ ఓ సభలో మాట్లాడుతూ... ఇటు సూర్యుడు అటు ఉదయించిన స రే... భూమి , ఆకాశం తలకిందులు అయినా సరే ... ఆఖరికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉరేసుకొని చచ్చిన సరే ఆగస్టు 15 వ తేదీ లోపు తెలంగాణ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని ప్రకటించాడు. ఇలా తాజా సభలో రేవంత్ రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: