రాజకీయ పార్టీ నాయకులకు కీలకంగా న్యూస్ పేపర్లు న్యూస్ చానల్స్ సైతం వ్యవహరిస్తూ ఉంటాయి.. అలా ఆంధ్రాలో తెలుగుదేశం అనుకూల మీడియాలు ఆరు ఉన్నాయి.. వైసీపీకి అనుకూల మీడియా రెండు.. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5, మహా టీవీ తెలుగుదేశం అనుకూల టీవీ చానల్స్. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ల యొక్క అనుకూల పత్రికలు.. ఇకపోతే ఇటు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ విషయానికి వస్తే.. సాక్షి పేపర్ ,సాక్షి న్యూస్ ఛానల్.. ఇవి కాకుండా టీవీ9 టీవీ ఫైవ్ వచ్చేసరికి ఇద్దరు వైపుగా ఉంటాయి.


ఇతర చానల్స్ లాగా టీవీ9 టీవీ5 ఎప్పుడు కూడా ఓవర్గా చూపించింది లేదు.. ముఖ్యంగా సాక్షి ఈటీవీ ఏబీఎన్ మహా టీవీ వంటి వాటిలాగా ఎగైనెస్ట్ గా ఎలాంటివి కూడా ఈ రెండు చానల్స్ రాయడం లేదు.. ముఖ్యంగా ఒకరి పక్షాన ఎప్పుడూ కూడా చూపించలేదు. ఇదంతా పక్కన పెడితే.. తెలుగుదేశం అనుకూల మీడియా బిజెపి పార్టీని తక్కువ చేసి చూపిస్తున్నారు.. రెగ్యులర్గా వాళ్ల యొక్క పత్రికల్లో కానీ టీవీలలో కానీ భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం వలస నాయకులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తూ చూపిస్తున్నారు.


అదే సందర్భంలో సాక్షి పేపర్ భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ కార్యకర్తల ఫీలింగ్స్ ఎక్స్పెక్టేషన్ చేస్తూ రాస్తున్నారు... ఇద్దరు బిజెపికి మేలు చేయడం కాదు.. ఎల్లో మీడియా బిజెపిలో ఉన్న టిడిపి నేతలకు మేలు చేస్తుంటే.. సాక్షి ఛానల్ ఏమో బిజెపిలో ఉన్నటువంటి ఆ టిడిపి వాళ్లకు అనుకూలంగా పురందేశ్వరి వ్యవహరిస్తోందన్నటువంటి ఫీలింగ్ నీ మిగతా కార్యకర్తలలో కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.. అందరూ కలిసినా భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయిలో అధికారులకు మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం  దౌర్భాగ్యకరమైన పరిస్థితులలోనే ఉన్నది.. మీడియానే వీళ్లను ముఖ్యంగా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.. మరి ఇకమీదనైనా బీజేపీ ప్రభుత్వం మేలుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: