పిఠాపురంలో జనసేన పార్టీకి సంబంధించి లోకల్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. కానీ టీ టైం ఉదయ్ కి జనసేన బాధ్యతలు అప్పగించడం పట్ల జనసేన వర్గాలు పవన్ పై రగులుతున్నాయి.ఇంకా దాంతో పాటు వర్మ పెత్తనం ఎక్కువ అవుతోందని వారు ఫైర్ అవుతున్నారు. జనసైనికులకు పవన్ కళ్యాణ్ సాక్ష్యాత్తు దేవుడుతో సమానం. పవన్ కళ్యాణ్ తలచుకుంటే ఆయన గెలుపు ఎవరూ ఆపలేరన్నది వారి విశ్వాసం. వర్మ జపం ఎందుకని వారు మధనపడుతున్నారుట. ఇవన్నీ ఇలా ఉంచితే తరచూ వర్మది త్యాగం అని పవన్ కళ్యాణ్ పొగుడుతూంటే ఆయన అనుచరులు మాత్రం చిరాకు పడుతున్నారట.వారిని దారిలో పెట్టి జనసేన పార్టీకి మద్దతుగా ఓట్లు వేయించడం ఇపుడు వర్మ చేతిలోనే ఉంది. వర్మ నిలబడతారని ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని ఆయన అనుచరులు బలంగా నమ్మారు. కానీ పొత్తుతో రాజకీయం  వేరే దారి పట్టింది. మరో వైపు చూస్తే వర్మను పొగుడుతూనే జనసేన పార్టీ తమ పనిలో తాము ఉందని సమాచారం తెలుస్తుంది. తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలని చూస్తోందని సమాచారం తెలుస్తుంది.


జనసేన పార్టీ తరఫున పవన్ అన్న నాగబాబు పెద్దరికం పాత్ర పోషిస్తున్నారు. ఆయన మొత్తం కో ఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఎవరు వచ్చినా ఎవరు డైరెక్షన్ చేసినా పిఠాపురం మొత్తం రాజకీయం వర్మకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంటున్నారు. ఇక జనసేన పార్టీ గెలిస్తే వర్మకు లాభమా నష్టమా అన్న యాంగిల్  కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్ గెలిచి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కచ్చితంగా మంత్రి అవుతారు. అప్పుడు వర్మ పరిస్థితి ఏమిటి ఆయనకు ప్రస్తుతం ఎన్నికల వేళ ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. పైగా ఇక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకుంటాను పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకు రాజకీయంగా కష్టకాలమేనా అన్న చర్చ కూడా మరో వైపు వస్తోంది. మకుటం లేని మహరాజుగా టీడీపీలో పిఠాపురంలో వెలిగిన వర్మ ఇపుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించిన తరువాత తన రాజకీయం ఏమిటని కూడా ఆలోచించుకోవాలని అంటున్నారు. దీంతో ఓ పక్క సొంత జనసైనికులతో పాటు తెలుగుదేశపు తమ్ముళ్లు కూడా రగిలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: