తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయ్. ఇక కొన్ని పార్లమెంటు స్థానాలలో విజయాన్ని పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్ అని చెప్పాలి. అయితే బిఆర్ఎస్ కంచుకోటగా పిలుచుకునే కెసిఆర్ సొంత జిల్లా మెదక్ లో విజయం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించడమే కాదు ఇక ముమ్మర ప్రచారం కూడా చేస్తూ ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇలా అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోతూ ఎంతలా హామీలు కురిపిస్తున్న ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనే విషయంపై మాత్రం ఇంకా అభ్యర్థులందరూ కూడా కన్ఫ్యూషన్ లోనే ఉన్నారూ అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మెదక్ బిఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కానీ ప్రస్తుతం గులాబీ పార్టీ నుంచి కీలక నేతలందరూ కూడా హస్తం గుడికి చేరుకుంటున్నారు. దీంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి  ఇంకోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోవైపు తెలంగాణలో మోడీ మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇలాంటి పరిస్థితుల మధ్య అటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో విజయం ఏ పార్టీని వరిస్తుంది అనే విషయంపై మాత్రం ప్రధాన పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటరు నాడి అంతుచిక్కక ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉండటం కూడా ఓటర్లను సైతం కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీలోకి పోతారో తెలియని పరిస్థితి నెలకొనడంతో.. కార్యకర్తలు అందరూ కూడా అయోమయంలో పడిపోతున్నారు. ఇలా బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో గెలుపు ఒక పెద్ద సవాల్ గానే మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: