తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే పార్లమెంటు ఎన్నికలు రావడంతో ఇక ఇప్పుడు ఎలక్షన్స్ వేడి తారస్థాయికి చేరుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన పార్టీలతో పాటు విజయం సాధించిన పార్టీలు ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏకంగా 17 స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కలుపుతున్నాయి. అయితే ఇక ప్రధాన పార్టీలుగా చెప్పుకునే బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఒక పార్లమెంట్ స్థానాన్ని మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. అదే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇది గులాబీ దళపతి కేసీఆర్ సొంత జిల్లా. అంతేకాదు 2004 నుంచి ఇక్కడ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా మెదక్ పార్లమెంట్ స్థానం అటు గులాబీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. అయితే ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో బిజెపి కాంగ్రెస్ పార్టీలు గులాబీ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాలని అనుకుంటున్నాయి. ఇక మరోవైపు ప్రధాన పార్టీలకు అటు ఇండిపెండెంట్ ల నుంచి కూడా తీవ్రమైన పోటీ ఎదురవుతుంది అని చెప్పాలి.


 ఇక ఇటీవలే మరో ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలైంది. మెదక్ ఎంపీ స్వాతంత్ర అభ్యర్థిగా దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏఐఎఫ్బి పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఆయన. అయితే గెలిచిన కొన్ని రోజులకే బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డికి మద్దతు ఇచ్చి ఆయన గెలుపు కోసం కృషి చేయకుండా.. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం సంచలనంగా మారింది. ఇదిగులాబీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr