తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులు తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో ఏకంగా ఆ పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకుంటున్నారు. దీంతో బిఆర్ఎస్ పార్టీలో అయోమయ పరిస్థితిలు నెలకోన్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మరికొంతమంది నేతలు హస్తం గూటికి చేరుకునే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి.


 ఇలాంటి సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను వదిలి బయటికి వచ్చారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఇప్పటికే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో  కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన కేసిఆర్ ఆంధ్ర రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసారు. రెండోసారి జగన్ అధికారంలోకి వస్తారని.. తమ దగ్గర సమాచారం ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు కెసిఆర్. ఇంకేముంది కెసిఆర్ చేసిన కామెంట్స్ ఆంధ్ర రాజకీయాలలో జగన్ ప్రత్యర్థులకు అస్సలు నచ్చలేదు. దీంతో కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఏపీలోని ప్రతిపక్ష నేతలు.


 ఈ క్రమంలోనే కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టిడిపి నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కెసిఆర్కే దిక్కులేదు  ఆయనే ఫామ్ హౌస్ లో పడుకున్నాడు  రేపు ఆ పక్కనే మరో రూమ్ రెడీ చేస్తే జగన్ కూడా అక్కడికి వస్తాడు. అధికారంలో లేని ఈ ఇద్దరు అక్కడ చింత పిక్కలాట ఆడుకుంటారు. అహంకారులకు ప్రజాస్వామ్యంలో చోటు ఉండదు అంటూ ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు  గుర్తుంచుకో  జగన్ జూన్ 5వ తేదీన నువ్వు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతావు. కేటీఆర్ కెసిఆర్ ఎవరైనా ఇది రాసి పెట్టుకోవాల్సిందే. మీకు అంత అభిమానం ఉంటే పక్కనే ఒక రూమ్ ఇవ్వండి అంటూ ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: