ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్ని సీజన్స్ నుంచి మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే  ఐదు సార్లు టైటిల్ విజేతగా ఉన్న జట్టు టైటిల్ పోరులో అంతకంతకు వెనకబడిపోతుంది  దీంతో కొత్త కెప్టెన్ తో అయినా తమకు అదృష్టం మళ్ళీ కలిసి వస్తుందేమో అని భావించిన జట్టు యాజమాన్యం ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ నిర్మొహమాటంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది  గుజరాత్ నుంచి తమ టీం లో చేర్చుకొని మరి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది..


 అయితే ఇలా కెప్టెన్సీ మార్పుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. కాగా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోనే ఆ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కొత్త కెప్టెన్ తో బరిలోకి ఆ జట్టుకు మాత్రం ఎక్కడ కలిసి రావడం లేదు. ఈ ఐపీఎల్ సీజన్లో చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది  ఎప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ టీం కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివర నుంచి మూడో స్థానంలో కొనసాగుతూ వస్తుంది.


 అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారధిగా మాత్రమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా పూర్తిగా విఫలం అవుతూ ఉండడం గమనార్హం. దీంతో హార్దిక్ ను టార్గెట్ చేస్తూ ఎంతో మంది ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కెప్టెన్ గా ప్లేయర్గా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాకు కీలక సూచనలు చేశాడు. గత రెండు సీజన్స్ నుంచి ముంబై ప్రదర్శన ఇలాగే ఉంది. అయితే జట్టుగా ఆడితేనే ముంబైకి విజయాలు దక్కుతాయి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాండ్యా తన వ్యక్తిగత ప్రదర్శన మెరుగుపరుచుకోవాలి అంటూ సూచించాడు  బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేసి కాస్త ముందుగా హార్దిక్ బ్యాటింగ్ చేయడానికి రావాలి అంటూ సూచించాడు వీరేంద్ర సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl