మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన పోయిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాడు. కాకపోతే అందులో ఓడిపోయాడు. ఆ తర్వాత జనసేన నుండి మళ్లీ పోటీ చేయబోయే సంకేతాలు వచ్చాయి. అందులో భాగంగా ఈయన విశాఖ జిల్లా అన‌కాపల్లి పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న చాలా కాలం అక్కడ గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసుకున్నారు. 

అందుకోసం ఆ ప్రాంతంలో వారం రోజులు  మ‌కాం వేసి మ‌రీ అక్కడ జనసేన పరిస్థితి అలాగే త‌న గెలుపుపై అంచ‌నాలు స‌రిచూసుకున్నారు. ఈయన గ్రౌండ్ పార్కులో అంతా బాగానే ఉంద‌ని  తాను ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్నాన‌ని నాగ‌బాబు దాదాపుగా సంకేతాలు ఇచ్చారు. కానీ  కూట‌మి లో భాగంగా ఈ సీటు బీజేపీ కి వెళ్ళింది. ఆ త‌ర్వాత‌ వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా అది కుద‌ర‌లేదు.

దానితో ఈయన ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో వెనక్కు తగ్గాడు. కానీ తమ్ముడికి , జనసేనకు సపోర్ట్ చేయడంలో మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పవన్ కు ఏ విషయంలోనైనా తోడుగా ఉంటూ ప్రతి దాంట్లోనూ సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేశాడు. అందులో కొంచెం డల్ గా ఉన్న నాగబాబు భుజంపై పవన్ కళ్యాణ్ చేయి వేశాడు.

ఇక ఈ ఫోటోకు నాగబాబు... నీ ఉద్దేశం ఏదైనా.. నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల జనసైనికుల్లో నేనొకణ్ణి. ఎందుకంటే నీ నిర్ణయం నా భుజం మీద నీ చేయి లాంటిది. అది బలాన్ని.. భరోసాని ఇస్తుందే తప్ప బరువుని.. బాధని ఇవ్వదు అని రాసుకోచ్చాడు. ఇక ఈ ఫోటో పార్టీ నుండి టికెట్ దక్కలేదు అని వేరే పార్టీలోకి వెళ్లిపోయిన వారికోసం అలాగే పార్టీలో ఉండి కూడా సపోర్ట్ చేయని వారిని ఉద్దేశించే నాగబాబు పెట్టినట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ నాగబాబు మాత్రం తన తమ్ముడికి సహాయం చేయడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: