తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినట్లు అయితే తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని మేనిఫెస్టోలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత నుండే బి ఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్నారు వారు ఇచ్చిన హామీలు అన్ని తీర్చడం అంత ఈజీ కాదు అవన్నీ కల్లబొల్లి మాటలు జనాలను మభ్యపరిచి ఓట్లు వేయించుకున్నారు తప్ప అవి ఆచరణ సాధ్యం అయ్యే పనులు కాదు అని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో ఎంతో క్రియాశీలకమైన వ్యక్తి అయినటువంటి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు అని అన్నారు. అది కూడా కేవలం అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ రోజుల్లోనే చేస్తాం అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఇంకా వాటి జాడ లేదు పత్తా లేదు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ కనుక రెండు లక్షల రుణమాఫీ ని తెలంగాణ రైతాంగానికి చేసినట్లు అయితే నేను రాజీనామా చేస్తాను అని ప్రకటించాడు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి , హరీష్ రావు మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. రేవంత్ తాజాగా ఓ సభలో మాట్లాడుతూ... రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నడు. రామప్ప, సమ్మక్క సారలమ్మ, వేయి స్థంబాల కూడా దేవాలయాల సాక్షిగా మాట ఇస్తున్న ఆగష్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. హరీష్ రావు రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో అని అన్నారు. ఇలా రేవంత్ , హరీష్ రావు మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: