తెలంగాణ ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అటు తెలంగాణలో ఇటు ఏపీలో పార్టీ అధినేతలు మోసపూరిత హామీలు ఇస్తున్నారు రాజకీయ నాయకులంతా ఎన్నికల్లో భాగంగా తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు దీంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుత రాజకీయ నాయకుల ప్రచార తీరుపై స్పందించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది భావించానని అన్నారు. అందుకే ఇప్పటికీ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. కానీ, ప్రజా జీవితంలో ఎప్పుడు తను యాక్టీవ్‌గా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను నిన్న కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించానని అన్నారు. ఇకపై ఏ పార్టీ రాజకీయాల్లోకి తాను వెళ్ళనని స్పష్టం చేశారు సాధారణ రాజకీయాల గురించి మాత్రమే స్పందిస్తానని వెంకయ్య నాయుడు వెల్లడించారు. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని అన్నారు. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి  అని చెప్పుకొచ్చారు.

నేతలు పార్టీలు మారడం ట్రెండ్ గా మారిందని అన్నారు. అదొక డిస్ట్రబింగ్ ట్రెండ్ అని మండిపడ్డారు. ఏ పార్టీలో నేత అయిన పదవికి రాజీనామా చేస్తే వేరే పార్టీలో చేరవచ్చు అని తెలిపారు. కానీ, పదవులకు రాజీనామా చేయకుండా నేతలు పార్టీలు మారడం సరికాదని ఆయన విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతాయో అవి మాత్రమే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని స్పష్టం చేశారు. చెట్లకు డబ్బులు కాయవనేది ఎంత వాస్తవమో.. తను ఉచితలకు వ్యతిరేకం అనేది కూడా అంతే వాస్తవమని తెలిపారు. కానీ ప్రజలందరికీ విద్యా, వైద్యం మాత్రం కచ్చితంగా ఉచితంగా ఇవ్వాలని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఇకపై ఉచితాలను ప్రశ్నించాలని అన్నారు.
అసభ్యంగా మాట్లాడే వారిని అవినీతిపరులను ప్రజలు తిరస్కరించాలని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: