ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే హైదరాబాదులో ఓటు హక్కు కలిగిన ఎంతో మంది సెలబ్రిటీలు ఉదయం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. అలాగే అందులో భాగంగా అనేక మంది తాము ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు.

అలా ఇప్పటికే ఈ రోజు ఉదయం నుండే అనేక మంది సెలబ్రిటీల ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇక ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు, ఒక వేళ ఈ సారి మహేష్ ఏదైనా అత్యవసర పని లో ఉండి ఓటు హక్కును వినియోగించు కోలేకపోతున్నాడా అని పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కానీ మహేష్ తాజాగా సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

ఇక మహేష్ బాబు ఈ రోజు హైదరాబాదు లో తన భార్య నమ్రత తో కలిసి తన ఓటు హక్కును తాజాగా వినియోగించుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మహేష్ బాబు ఈ రోజు పోలింగ్ బూత్ కి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్ ను ధరించి విచ్చేశాడు.

ఇక తలకి క్యాప్ పెట్టుకున్నాడు. మహేష్ దాదాపు అతిధి సినిమా తర్వాత పొడవాటి జుట్టును పెంచుకున్నాడు. రాజమౌళి సినిమా కోసమే మహేష్ ఈ కొత్త లుక్ లో ఉన్నాడు. ఇకపోతే మహేష్ పొడవాటి జుట్టుతో అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉండడంతో ఈయన అభిమానులు మహేష్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ వీడియోస్ ఫుల్ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: