పులివెందుల నియోజకవర్గంలో జగన్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఎప్పటికీ జరగదనే సంగతి తెలిసిందే. పులివెందులలో జగన్ కు తిరుగులేదని ఆయనను ఓడించాలని అనుకోవడం మూర్ఖత్వం అని ఇతర పార్టీల నేతలు భావిస్తారు. అయితే కూటమి నేతలలో చాలామంది నేతలకు మాత్రం తాము పోటీ చేసే నియోజకవర్గాల్లో ఓడిపోతామనే భయం మాత్రం ఉందనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పవన్, లోకేశ్ లకు ఒకింత భారీ షాకులు తగిలాయి.
 
కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్, హిందూపురం నుంచి బాలయ్య, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయగా ఈ నలుగురు నేతలలో ఇద్దరు నేతలకు ఎన్నికల ఫలితాల సమయంలో భారీ షాకులు తప్పవని తెలుస్తోంది. కనీసం ఇద్దరు నేతలను ఓడించేలా లేదా మెజారిటీలను ఊహించని స్థాయిలో తగ్గించేలా జగన్ ప్రణాళికలు వేశారని తెలుస్తోంది. ఈ నలుగురు నేతలలో ఎవరికి షాకులు తగులుతాయో చూడాల్సి ఉంది.
 
జగన్ స్ట్రాటజీలు వేరేలెవెల్ లో ఉంటాయని సామాన్యుల ఊహలకు సైతం అందని స్ట్రాటజీలతో జగన్ ప్రత్యర్థులకు భారీ షాకులిచ్చేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. కూటమి ప్రధాన నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తే మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత భారీ షాకులు తప్పవని తెలుస్తోంది. ఏపీలో పురుషుల ఓట్లతో పోల్చి చూస్తే మహిళల ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యాయి.
 
తాము వేసిన ఓట్ల గురించి మహిళలు పురుషులలా చెప్పుకోరు. అందువల్లే గ్రౌండ్ లెవెల్ లో కూటమికి ఒకింత పాజిటివ్ గా వినిపిస్తోంది. అయితే గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఒకేలా అయితే ఉండవు. చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండటంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో క్లారిటీ లేదు. జగన్ సరైన వ్యూహాలతోనే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని భోగట్టా. జగన్ నమ్మకం నిజమవుతుందో లేదో మరో 20 రోజుల్లో ఫలితాల రూపంలో తేలిపోనుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: