తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే పేరుతో పార్టీ ని స్థాపించాడు. 2014 ఎలక్షన్ లకి ముందే పార్టీని స్థాపించిన ఆ ఎలక్షన్ లో మాత్రం జనసేన పార్టీ పాల్గొనలేదు. ఇక 2019 వ సంవత్సరం జనసేన పార్టీ ఎలక్షన్ లోకి దిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గాజువాక , భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశాడు. మొదటి అంచనాల ప్రకారం పవన్ రెండిటిలో గెలుస్తాడు, కొంచెం అటు ఇటు అయినా ఒక దాంట్లో కచ్చితంగా గెలుస్తాడు అని ఎంతో మంది ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ రిజల్ట్ డే రోజు జనసేన పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ కు కూడా భారీ దెబ్బ తగిలింది. పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీచేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. జనసేన పార్టీ రాష్ట్ర మొత్తంలో ఒకే ఒక్క సీటును కైవసం చేసుకుంది. దీనితో పవన్ ఆలోచనలో పడ్డాడు. దానితో 2019 లో జరిగింది 2024 లో అస్సలు జరగకూడదు అని ఫిక్స్ అయ్యాడు. దానితో ఒంటరిగా వెళ్లకుండా టీడీపీ , బీజేపీ లతో కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాడు. పోయిన సారి రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలో ఓడిపోయిన పవన్ ఈ సారి ఆ తప్పు చేయకుండా కేవలం పిఠాపురంలో మాత్రమే పోటీ చేశాడు. ఇకపోతే పోయిన సారి పవన్ పోటీ చేసిన గాజువాక , భీమవరం నియోజకవర్గాల్లో కాపు ఓట్ల సంఖ్య కాస్త తక్కువ.

ఇక పవన్ కాపు సామాజిక వర్గం వ్యక్తి కావడంతో పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ప్రజలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని పవన్ ఎంచుకున్నాడు. ఈ సారి మాత్రం పవన్ పిఠాపురంలోని కాపు సామాజిక వర్గ ప్రజలను ప్రధాన టార్గెట్ గా చేసుకొని తన ప్రచారాలను సాగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి ఎన్నికలలో పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గం లో ఓటింగ్ శాతం కూడా భారీగానే జరిగింది. దానితో కాపు సామాజిక వర్గ వ్యక్తుల ఓట్లను , వారి మనసులను దోచుకోవడంలో పవన్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యాడు అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: