ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఇండియా హెరాల్డ్ అందిస్తున్న సమాచారం ప్రకారం.. జగన్ మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేలింది. ఇక.. పిఠాపురం స్థానికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నా.. వైసీపీనే మళ్ళీ గెలుస్తుందని ప్రజల నోటి నుంచి వినిపిస్తోంది. అయితే ఈమధ్య కాలంలో పవన్ తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఈ తరహా తీరును పవన్ కళ్యాణ్ ప్రదర్శించలేదని తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భూమికను పోషిస్తారా లేదా అనే విషయం ఆసక్తి రేపుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈమధ్య కాలంలో ఆయన తన భార్య అన్నాను వెంట బెట్టుకొని పలు కార్యక్రమాల్లో హాజరు కావటం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల మీదా..ఇంకా ఆయన భార్యల మీదా ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ కామెంట్స్ చేయటం వల్ల కొంచెం పవన్ ఇమేజ్ డామేజ్ అయ్యింది. మొదట్లో ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉన్న పవన్ కళ్యాణ్.. ఈమధ్య కాలంలో స్పందంచటమే కాదు.. తన మీద విమర్శల కోసం పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించటం గమనార్హం. పైగా రాజకీయాల్లో ఇంకా సినిమా రంగంలో యాంటి ఫ్యాన్స్ నాలుగో పెళ్లి అంటూ చేస్తున్న ప్రచారం కూడా ఎక్కువైంది. దీంతో.. తన భార్యను తీసుకొని ఈ మధ్య కాలంలో పలు చోట్లకు తీసుకెళుతున్నారు పవన్ కళ్యాణ్.


తన భార్యకు ఓటు హక్కు లేనప్పటికీ పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి మరి ఆమెకు చూపించే ప్రయత్నం చేయటంతో పాటు.. పోలింగ్ ఏ తీరులో జరుగుతుందో కూడా పవన్ ఆమెకు వివరించారు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ సందర్భంగా తన భార్య అన్నాతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రయాణించారు. అంతేకాదు.. వీరిద్దరూ జంటగా కాశీ విశ్వనాథుని గుడికి వెళ్లి పూజలు.. అభిషేకాన్ని చేపట్టారు. ఇదిలా ఉంటే.. పవన్ వెంట యూపీ పర్యాటక మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా పవన్ దంపతుల వెంట ఉంటూ.. వారి పట్ల జాగ్రత్త తీసుకోవటం కనిపించింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని చోట్లకు తన భార్యను తీసుకెళ్లిన  పవన్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. దీంతో అందరూ ఇప్పుడు పాజిటివ్ గా ఉన్నారు.ఇదే పనిని ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందు చేసుంటే బాగుండేది.


ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి వెంట తీసుకొని వెళ్లటం ద్వారా మహిళల్ని పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చు. ఈ పని ఎన్నికల ముందు చేసుంటే పవన్ విడాకులు తీసుకుంటున్నారు, నాలుగో పెళ్లి చేసుకుంటున్నారు అనే గాలి విమర్శలకి చెక్ పడి ఆయనకి అనుకూలంగా కొన్ని ఓట్లు పడేవి. కానీ అంతా అయిపోయింది. ఎన్నికలు జరిగిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి పక్కాగా జనాల మద్దతుతో గెలవడం పక్కా. ఏది ఏమైనా.. గతానికి భిన్నంగా ప్రస్తుతం ఇలా తన భార్యను వెంట పెట్టుకొని తిరుగుతున్న పవన్ తీరు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: